ముంబైకి కుక్ సేన: 5న ప్రాక్టీస్, 9న తొలి మ్యాచ్
ముంబై: అలెస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం బుధవారం బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు చేరుకుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముంబై విమానాశ్రయంలో దిగిన ఇంగ్లాండ్ జట్టు రెండు గంటల తర్వాత దక్షిణ ముంబైలోని హోటల్‌కు చేరుకుంది.
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరిస్ జరగడం ఇది ఆరోసారి. 1984-85లో మొదలైన తొలి సిరీస్‌కు గవాస్కర్, డేవిడ్ గోవర్ కెప్టెన్లుగా వ్యవహరించారు. ఈ సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ వరుసగా మూడు సెంచరీలు సాధించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఈనెల 9న రాజ్‌కోట్‌లో జరగనున్న తొలి టెస్టులో పాల్గొనే వరకు ఇంగ్లాండ్ జట్టు ముంబైలోనే బస చేయనుంది. ప్రాక్టీసు కోసం ఈ నెల 5న క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు చెందిన బ్రబోర్న్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుంది. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య నవంబర్ 9 నుంచి టెస్ట్ సిరిస్ ప్రారంభం కానుంది.

తొలి టెస్ట్ మ్యాచ్‌కి రాజ్ కోట్ ఆతిథ్యం
తొలి టెస్ట్ మ్యాచ్‌కి రాజ్ కోట్ ఆతిథ్యం ఇవ్వనుంది. తొలిసారిగా టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇస్తున్న క్రమంలో ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ (ఎస్‌సీఏ) యోచిస్తుంది. ఇందులో భాగంగా సౌరాష్ట్ర నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన టెస్టు క్రికెటర్లను సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఆహ్వానం
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కూడా ఎస్‌సీఏ ఆహ్వానించింది. అయితే ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో స్పష్టత లేదు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మాత్రం ఈ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు అంగీకరించినట్లు ఎస్‌సీఏ మీడియా మేనేజర్ హిమన్షు షా వెల్లడించారు.

నవంబర్ 9 నుంచి టెస్ట్ సిరిస్ ప్రారంభం
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య నవంబర్ 9 నుంచి టెస్ట్ సిరిస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ మ్యాచ్‌కి రాజ్ కోట్ ఆతిథ్యం ఇవ్వనుంది. వన్డే సిరిస్ జనవరి 15, 2017న ప్రారంభం కానుంది. పూణెలో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. జనవరి 26 నుంచి ట్వంటీ20 సిరిస్ కాన్పూర్‌లో ప్రారంభం కానుంది.

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ షెడ్యూల్:
అన్ని మ్యాచ్‌లు ఉదయం 9.30 గంటలకు మొదలవుతాయి
1st Test - November 9-13 (Wednesday to Sunday) - Rajkot
2nd Test - November 17-21 (Thursday to Monday) - Visakhapatnam
3rd Test - November 26-30 (Saturday to Wednesday) - Mohali
4th Test - December 8-12 (Thursday to Monday) - Mumbai
5th Test - December 16-20 (Friday to Tuesday) - Chennai
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications