
న్యూ ఢిల్లీ: ఇటీవల ముగిసిన ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్ ఘోరంగా విఫలమైంది. ఆడిన ఐదు వన్డేల్లో కేవలం హాంకాంగ్, అఫ్గనిస్తాన్‌లపైనే గెలిచింది. దీంతో సూపర్ 4లోనూ అర్హత దక్కించుకోలేకపోయింది. అయితే ఈ వైఫల్యాన్ని అడ్డం పెట్టుకుని ఇంగ్లాండ్ క్రికెట్ తన సోషల్ మీడియాలో పాక్ బలహీనత కనిపించేలా పోస్టు చేసింది. వచ్చే ఏడాది ప్రపంచ కప్ రానున్న నేపథ్యంలో తెలివిగా ఆలోచించిన పాకిస్తాన్ మే నెలలో వన్డే టోర్నీని పెట్టుకుంది.
ఇది ప్రపంచ కప్‌కు ఒక్క నెల రోజుల కంటే ముందుగానే జరగనున్నది. మే 5నుంచి మే19వరకూ జరగనున్న టీ20 సిరీస్‌కు టిక్కెట్లను అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టు పెట్టింది. అదేమంటే 'ఇంగ్లాండ్ ఒక రోజు మ్యాచ్‌లో 500 పరుగులు చేయగలదా? పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ టిక్కెట్లు అక్టోబరు 10 ఉదయం 10గంటల నుంచి అందుబాటులో ఉంటాయి' అని పేర్కొంది.
ఇంతకుముందు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్టుతో పోరాడి అత్యధికంగా 481 పరుగులు చేసింది. ఇంకొక గమనించదగ్గ విషయమేమంటే గతంలో ఇంగ్లాండ్ పాకిస్తాన్‌తో తలపడి 444పరుగులు చేసింది. ఆ స్కోరు చేసింది కూడా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికపైనే. అన్నట్లుగానే ఒక వేళ వీలు కుదిరితే వాళ్లు 500 స్కోరు చేయడానికి కూడా వెనుకాడరు.
పాకిస్తాన్ ప్రస్తుతం అక్టోబరు 7 నుంచి ఆస్ట్రేలియా పర్యటన చేయనుంది. ఈ పర్యటనలో పాక్ టెస్టు సిరీస్ ఆడి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పాకిస్తాన్ ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో వైఫల్యం చెందడానికి కారణాన్ని పాక్ కోచ్ ఆర్థర్ విశ్లేషిస్తూ.. తమ జట్టు ఆటగాళ్లు పూర్తిగా భయపడిపోయారని అందుకే చేధించలేకపోయారని పేర్కొన్నాడు. మరో పక్క పాక్ కెప్టెన్‌పై కూడా విమర్శలు ధాటిగా వస్తున్నాయి.