Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్‌ క్రికెట్‌ దిగ్గజం బాబ్‌ విల్లీస్‌ కన్నుమూత!!

England cricket great Bob Willis passes away at 70

లండన్‌: ఇంగ్లండ్‌ క్రికెట్‌ దిగ్గజం, మేటి ఫాస్ట్‌ బౌలర్‌ బాబ్‌ విల్లీస్‌ (70) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విల్లీస్‌ మృతి చెందినట్టు బుధవారం కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. విల్లీస్‌ మరణంతో అతని కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. 'మా ప్రియమైన బాబ్‌ను కోల్పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. అతను ఓ మంచి భర్త, తండ్రి, సోదరుడు మరియు తాత. ప్రతి ఒక్కరిపై చాలా ప్రభావం చూపారు' అని విల్లీస్‌ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

1971లో ఆస్ట్రేలియాపై టెస్ట్‌ అరంగేట్రం చేసిన బాబ్‌ విల్లీస్‌.. దశాబ్దం పాటు ఇంగ్లండ్‌ జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచారు. 90 టెస్టుల్లో 25.20 సగటుతో 325 వికెట్లు తీసిన విల్లీస్‌.. 70వ దశకంలో ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడిగా నిలిచారు. విల్లీస్‌ 1981 యాషెస్‌ సిరీస్‌లో హెడింగ్లే టెస్ట్‌లో 8/43తో కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశారు. ఈ సంచలన ప్రదర్శన ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. అత్యధిక టెస్ట్ వికెట్ తీసుకున్న ఆల్-టైమ్ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు.

బాబ్‌ విల్లీస్‌ 64 వన్డేల్లో 80 వికెట్లు పడగొట్టారు. 18 టెస్ట్‌లు, 29 వన్డేల్లో విల్లీస్‌ ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. జులై 1984లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ విల్లీస్‌ చివరి అంతర్జాతీయ మ్యాచ్. 1991లో స్కై స్పోర్ట్స్‌తో సుదీర్ఘ కాలం పనిచేశారు. గతంలో బిబిసితో కూడా కలిసి పనిచేశారు.

ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) విల్లీస్‌కు నివాళి అర్పించింది. 'చాలా బాధగా ఉంది. విల్లీస్‌ అత్యుత్తమ ఆటగాడు. అతను క్రికెట్ ఆట కోసం చేసిన ప్రతిదానికీ కృతజ్ఞతలు' అని పేర్కొంది. ఈసీబీలోని ప్రతి ఒక్కరూ అతని కుటుంబానికి హృదయపూర్వక సంతాపం తెలిపారు. ఇంగ్లాండ్ క్రికెట్ ప్రియమైన స్నేహితుడిని కోల్పోయింది అని అన్నారు. ఐసీసీ కూడా విల్లీస్‌కు నివాళి అర్పించింది.

Story first published: Thursday, December 5, 2019, 9:47 [IST]
Other articles published on Dec 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+