ఇంగ్లాండ్ ప్రతీకారం తీర్చుకునేనా!: 2019 యాషెస్ సిరిస్ షెఢ్యూల్ ఇదే

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న యాషెస్ సిరిస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గురుువారం ప్రకటించింది. సుమారు నెలన్నర పాటు జరిగే ఈ యాషెస్ సిరిస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది.
ఈ సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత లార్డ్స్, లీడ్స్, మాంచెస్టర్, ది ఓవల్ వేదికల్లో మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన యాషెస్ సిరిస్‌లో ఇంగ్లాండ్ 4-0తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా... అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత పెర్త్ వేదికగా జరిగిన మూడో టెస్టులో విజయం సాధించి నాలుగు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.
ఇక, సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో సైతం ఇంగ్లాండ్‌పై ఆతిథ్య ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 123 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు తొలిసారి యాషెస్ గెలుపు రుచిని చూసింది. దీంతో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరిస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఇంగ్లాండ్ ఉంది.
ఇంగ్లాండ్ వేదికగా యాషెస్ సిరిస్ షెడ్యూల్:
మొదటి టెస్టు: August 1-5 at Edgbaston, Birmingham
రెండో టెస్టు: August 14-18 at Lord's, London
మూడో టెస్టు: August 22-26 at Headingley, Leeds
నాలుగో టెస్టు: September 4-8 at Old Trafford, Manchester
ఐదో టెస్టు: September 12-16 at The Oval, London
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications