కోహ్లీని కట్టడి చేసేందుకే అతణ్ని జట్టులోకి తెస్తున్నారు..!!

హైదరాబాద్: మునుపటి కంటే పటిష్ఠమైన జట్టుతో ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది కోహ్లీసేన. కచ్చితంగా అన్ని సిరీస్ లు గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. అలాంటిది మొదటిదైన టీ20 సిరీస్‌ను గెలిచిన తర్వాత మళ్లీ అదే తరహాలో పుంజుకోలేకపోతోంది. ఈ క్రమంలో రెండో సిరీస్ అయిన వన్డేను 1-2తేడాతో కోల్పోయింది. ఆఖరిదైన నిర్ణయాత్మక వన్డే.. మూడో వన్డేలోనూ ఓటమికి గురికావడంతో.. సిరీస్‌ను చేజార్చుకుంది.

మూడో వన్డేలో కోహ్లీ ఒక్కడే రాణిస్తున్నా..
ఈ మూడో వన్డేలో కోహ్లీ ఒక్కడే రాణిస్తున్నాడు అనుకున్న తరుణంలో ఇంగ్లాండ్ సంధించిన బాణం.. అదిల్ రషీద్. కోహ్లీ వికెట్ అనూహ్య రీతిలో పడేశాడు. దానిపై కోహ్లీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తాను అండర్ 19 ఆడుతున్నప్పటి నుంచి రషీద్ బౌలింగ్‌ను ఎదుర్కొంటున్నానని ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆగష్టు 1 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.

టెస్టుల్లోనూ కోహ్లిని కట్టడి చేస్తే.. తమకు తిరుగులేదని
టెస్టుల్లోనూ కెప్టెన్ కోహ్లిని కట్టడి చేస్తే.. తమకు తిరుగులేదని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఇందుకోసం ఏడాది క్రితమే టెస్టుల నుంచి వైదొలిగిన స్పిన్నర్‌ను తిరిగి లాంగ్ ఫార్మాట్లోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతడెవరో కాదు.. చివరి వన్డేలో కోహ్లిని కళ్లు చెదిరే బంతితో బౌల్డ్ చేసిన అదిల్ రషీద్. ఈ ఇంగ్లిష్ స్పిన్నర్ విసిరిన బంతి అనూహ్య రీతిలో ఆఫ్ వికెట్‌ను పడగొట్టడంతో కోహ్లి నివ్వెరపోయాడు.

అదిల్ రషీద్‌ను తిరిగి టెస్టుల్లోకి
నమ్మలేనట్టుగా ముఖంలో భావాలను పలికించాడు. ఈ దృశ్యమే ఇంగ్లాండ్ సెలక్టర్ల మదిలో ఇంకా మెదులుతోంది కాబోలు. అందుకే అదిల్ రషీద్‌ను తిరిగి టెస్టుల్లోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లెగ్ స్పిన్నర్ ఇంగ్లాండ్ జాతీయ సెలక్టర్ ఎడ్ స్మిత్ మంతనాలు జరుపుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇంగ్లాండ్ జట్టులో అనుభవజ్ఞుడైన స్పిన్నర్ లేడు. దీంతో రషీద్ పునరాగమనం జట్టుకు ప్రయోజనకరమని సెలక్టర్లు భావిస్తున్నారు.

వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. తన కెరీర్‌లోనే అత్యధికంగా 911 పాయింట్లు సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌తో 2 పాయింట్లు సాధించి 911 మార్క్‌ను చేరుకున్నాడు. ఇంగ్లండ్ చేతిలో భారత్ సిరీస్ చేజార్చుకున్నా.. విరాట్ మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 75, 45, 71 పరుగులు చేసి రెండు పాయింట్లను సంపాదించాడు. అయితే మార్చి 1991లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్ (918) తర్వాత అత్యధిక పాయింట్లు సాధించిన క్రికెటర్ కోహ్లీనే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications