ఇది అవమానకరం: ఇంగ్లాండ్ 85 పరుగులకే ఆలౌట్ కావడంపై వాన్

హైదరాబాద్: బుధవారం ఐర్లాండ్‌తో ప్రారంభమైన ఏకైక టెస్టులో 85 పరుగులకే ఆలౌటవ్వడం ఇంగ్లాండ్ జట్టుకు అవమానకరమని మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్-ఐర్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా బుధవారం ప్రారంభమైన నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 23.4 ఓవర్లలో 85పరుగులకే ఇంగ్లిష్ జట్టు ఆలౌటైన సంగతి తెలిసిందే.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
దీనిపై మైకేల్ వాన్ మాట్లాడుతూ "బంతి అద్భుతం చేస్తున్నప్పుడు మనం కళ్లు మూసుకోవాల్సిందే. ఇంగ్లాండ్ జట్టు సైతం అదే చేసింది. పిచ్ పేసర్లకు అనుకూలించడంతో కొన్ని కొన్ని మంచి బంతులు వేశారు. ఇక, ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా చెత్త షాట్లు ఆడారు" అని చెప్పుకొచ్చాడు.

ఇది అవమానకరం
"నిజం చెప్పాలంటే ఇది అవమానకరం. క్రికెట్ పుట్టిన గడ్డపై టెస్టు మ్యాచ్‌లో అది కూడా పసికూన లాంటి ఐర్లాండ్ చేతిలో 85 పరుగులకే ఆలౌటయ్యారు. ఈ ప్రదర్శనను వివరించడానికి ఇంతకన్నా వేరే పదం లేదు. ఈరోజు ప్రదర్శన నుంచి తప్పించుకునే వీల్లేదు. సాకులు చెప్పకండి. ఈరోజు ఓ చెత్త రోజు" అని వాన్ పేర్కొన్నాడు.

లార్డ్స్ వేదికగా ఏకైక టెస్టు
లార్డ్స్ వేదికగా ప్రారంభమైన ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ చేతిలో 23.4 ఓవర్లలో 85పరుగులకే ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ఆలౌటైంది. ఐర్లాండ్ బౌలర్లలో టిమ్ ముర్టాగ్(5/13) సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది.

ముగ్గురు డకౌట్
ఇంగ్లాండ్ జట్టులో ఏడుగురు బ్యాట్స్‌మన్ కనీసం రెండంకెల స్కోరును కూడా చేయలేకపోయారు. బెయిర్‌స్టో, అలీ, మార్క్ వుడ్‌లు డకౌట్‌గా వెనుదిరిగారు. జోయ్ డెన్లీ చేసిన 23 పరుగులే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో అత్యధికం. మరో ఐర్లాండ్ బౌలర్ మార్క్ ఆదిర్(3/32) కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

22 ఏళ్ల తర్వాత
అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 207 పరుగులకు ఆలౌటై.. 122 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కాగా, 1997లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్ 77 పరుగులకే ఆలౌటైంది. 22 ఏళ్ల తర్వాత మళ్లీ తక్కువ స్కోరుకు ఆలౌటవ్వడం ఇదే తొలిసారి. ఐర్లాండ్ జట్టుకు ఇది మూడో టెస్టు కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications