Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లార్డ్స్ టెస్టు ఓటమి: సన్నీ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన ఇంగ్లాండ్ కోచ్

England coach Trevor Bayliss defends India after Lord’s defeat

హైదరాబాద్: భారత క్రికెట్‌ జట్టు వరుస రెండు టెస్టుల్లో వైఫల్యం చెందడానికి పెద్దగా ప్రాక్టీస్‌ లభించకపోవడం కూడా ఒక కారణమన్న మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌కు ఇంగ్లాండ్‌ హెడ్ కోచ్‌ ట్రావెర్‌ బేలిస్‌ గట్టిగానే సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 0-2తో వెనకబడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ట్రావెర్‌ బేలిస్‌ మాట్లాడుతూ "ఆస్ట్రేలియా, భారత్‌, ఇంగ్లండ్‌లు ఎక్కువగా క్రికెట్‌ ఆడుతున్న జట్లు. అయినప్పటికీ ప్రతీ జట్టు వార్మప్‌ మ్యాచ్‌లను కోరుకోవడం సహజం. అయితే ఎక్కువ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను షెడ్యూల్‌ చేర్చడం దాదాపు అసాధ్యం. కాకపోతే అన్నిసార్లూ అలా కుదరదు" అని చెప్పుకొచ్చాడు.

"ఎడతెరపి లేకుండా క్రికెట్‌ ఆడుతున్న ఆటగాళ్లకు కచ్చితంగా విశ్రాంతి అవసరం. చాలామంది అన్ని మ్యాచ్‌లూ ఆడతారు. అలాంటి వారు సన్నాహక మ్యాచుల్లో ఆడటం కుదరదు కదా" అని బేలిస్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ముందు ఎసెక్స్‌ జట్టుతో భారత జట్టు మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడిన సంగతి తెలిసిందే.

ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఆ ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు నాలుగు రోజుల కేటాయించగా, కొన్ని కారణాల వల్ల దాన్ని మూడు రోజులకు కుదించాల్సి వచ్చింది. దీంతో అక్కడి వాతావరణానికి, పిచ్‌లకు అలవాటు పడేందుకు ఎక్కువ సన్నాహక మ్యాచ్‌లు అవసరమని సునీల్‌ గావస్కర్‌ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ కోచ్ స్పందించాడు.

England coach Trevor Bayliss defends India after Lord’s defeat

"భారత్‌లో పర్యటించేటప్పుడు కూడా మాకు ఇదే డైలమా ఉంటుంది. ఎక్కువ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఉంటే బాగుంటుందని మాకూ అనిపిస్తుంది. ఆ సమయంలో మీ ప్రిపరేషన్‌ సరిగా ఉందా అనే ప్రశ్నించడం కరెక్ట్‌ కాదు కదా. వారానికి పది రోజులు ఉండవు కదా" అని బేలిస్‌ అన్నాడు. ఈ సిరిస్‌లో అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, క్రిస్‌వోక్స్‌ అద్భుత ప్రదర్శన చేశారని బేలిస్ అన్నాడు.

లార్డ్స్ టెస్టులో క్రిస్ వోక్స్‌, జానీ బెయిర్‌స్టో కీలక భాగస్వామ్యం భారత్‌పై విజయం సాధించడానికి తోడ్పడిందని ఇంగ్లాండ్ కోచ్ బేలిస్ అన్నాడు.

Story first published: Tuesday, August 14, 2018, 21:44 [IST]
Other articles published on Aug 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+