
హైదరాబాద్: ఈ మధ్యనే జరిగిన యాషెస్ సిరీస్‌లో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లాండ్ జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకునేందుకు ట్రెవర్ బేలిస్ సిద్ధంగా ఉన్నాడు. అయితే తను జట్టుతో చేసుకున్న ఒప్పందం వచ్చే ఏడాదితోముగియనుంది. ఈ నేపథ్యంలో ఇక మున్ముందుకు జట్టుతో కలిసి ప్రయాణించేది లేదని తేల్చి చెప్పాడు.
వచ్చే ఏడాది అంటే 2019 సెప్టెంబరుతో ట్రెవర్ బేలిస్ జట్టుతో చేసుకున్న ఒప్పందం ముగియనుంది. ముందుగానే నాలుగేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ప్రస్తుతం బేలిస్ తను యాషెస్ సిరీస్‌లో ఓడినందుకు అతను వెళ్లివోవట్లేదని వ్యాఖ్యానించాడు.
జట్టులో నాలుగేళ్లకోసారి మార్పులు చేయడం చాలా ముఖ్యమని, ఈ పద్ధతిని సంప్రదాయంగా భావించాలి అని పేర్కొన్నాడు. అంతేగాక తనకు కూడా ఎక్కడా నాలుగు ఐదేళ్లుగా ఓకే చోట ఉండటం అలవాటు లేదని తెలియజేశాడు.
కెప్టెన్ జో రూట్ మారకుండా అలానే ఉంటే మాత్రం జట్టులోని క్రీడాకారులు ఏడుగురు వరకు స్థానం మారకుండా అదే జట్టుతో కొనసాగనున్నారు. ప్రస్తుతం జట్టు బాగానే రాణిస్తుంది. విన్స్, స్టోన్‌మన్‌లు బాగానే ఆడగలరు. కానీ, యాషెస్ సిరీస్‌లో సరిగ్గా రాణించలేకపోయారని అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.