
హైదరాబాద్: యాషెస్ సిరీస్‌లో వివాదాలు రోజురోజుకు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మూడో టెస్ట్‌కు ముందు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ వచ్చిన వార్తల వివాదం ఇంకా మరిచిపోక ముందే మళ్లీ ఇంకో విషయం బయటికి వచ్చింది. ఇదైతే ఏకంగా బంతి ఆకారాన్నే మార్చేస్తున్నారంటూ వచ్చిన వార్త.
ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ జేమ్స్ అండర్సన్ బంతి ఆకారాన్ని మార్చేప్రయత్నం చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. సీనియర్ క్రికెటర్ అలెస్టర్ కుక్ రికార్డు సెంచరీతో తొలిసారి ఆసీస్‌పై యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇలా ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకోవడం ఇంగ్లండ్‌కు తీవ్ర ఇబ్బందిగా మారింది.
బంతిని ట్యాంపర్ చేయడం మొదలెట్టాడు
ఆసీస్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో అండర్సన్ బంతిని గోర్లతో ఆకారాన్ని మారుస్తున్నట్లు బయటపడింది. దాన్ని గమనించిన ఫీల్డ్ అంపైర్లు సుందరం రవి, కుమార ధర్మసేన ఇరు జట్ల కెప్టెన్లతో చర్చించారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ కోచ్ తీవ్రంగా ఖండించాడు.
కోచ్ ట్రెవర్ బెయిలిస్ మీడియాతో మాట్లాడుతూ.. 'అండర్సన్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాను. అతని వీడియోను చూశాను. అతను బంతి ఆకారాన్ని మార్చాలనుకోలేదు. ఒక వేళ బంతి ఆకారాన్ని మార్చాలని అతను అనుకుంటే సరైన రీతిలో రివర్స్ స్వింగ్ అయ్యేటట్లు ప్రయత్నించేవాడు. కానీ అలా జరుగలేదు. ఇది తెలిసిన వెంటనే నేను అంపైర్లతో మాట్లాడాను. ఎలాంటి అందోళన చెందాల్సిన అవసరం లేదని వారు చెప్పారు.' అని పేర్కొన్నాడు.
బాల్ ట్యాంపరింగ్‌పై ఎలాంటి ఆరోపణలు రాలేదని మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలె కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఆఖరి సెషన్ ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఐదో రోజు పూర్తి మ్యాచ్ కొనసాగితే.. ఫలితం ఇంగ్లండ్‌కు అనుకూలంగా వచ్చే అవకాశముంది.
164 పరుగుల లోటుతో ఆసిస్ రెండో ఇన్నింగ్స్‌కు దిగింది. శుక్రవారం మ్యాచ్ పూర్తయ్యే సరికి రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. వార్నర్ (40 నాటౌట్), కెప్టెన్ స్మిత్ (25 నాటౌట్) క్రీజులో ఉన్నారు. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్న ఆసీస్ 61 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.