
ఆడొద్దని చెప్పడం చాలా కష్టం
'ఐపీఎల్‌లో ఆడకూడదని ఆటగాళ్లకు చెప్పడం చాలా కష్టంగా మారింది. ఆ లీగ్ ప్రాధాన్యత గుర్తించిన తర్వాత ఆడకూడదని చెప్పలేం. టీ20 ప్రపంచంలో అదో భారీ క్రికెట్ లీగ్. ఆ లీగ్‌లో మా ఆటగాళ్లు అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడుతుండడం మాకూ మేలు చేసేదే. మా ఆటగాళ్లలో కొంతమంది ప్రతిభ వెలుగులోకి వచ్చింది. లీగ్‌లో ఇప్పటికే చాలా మంది ఆడుతున్నారు. ఐపీఎల్ వేలంలో మార్క్‌వుడ్, మొయిన్ అలీ, జాసన్ రాయ్, డేవిడ్ మలన్ అమ్ముడుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని సిల్వర్‌వుడ్ అన్నారు.

ఐపీఎల్ 2021కోసం టెస్టులకు దూరం
బిగ్‌బాష్ లీగ్‌లో ఆడని కొంతమంది ఇంగ్లండ్ ఆటగాళ్లు.. ఐపీఎల్ 2021కోసం టీమిండియాతో టెస్టులకు దూరమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఐపీఎల్ కోసం ఇంగ్లండ్‌లో సిరీస్‌కు న్యూజిలాండ్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2021 తేదీలు ఇంకా విడుదల కాలేదు. కానీ ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో కివీస్ ఆడే తొలి టెస్టు జూన్ 2న ఆరంభం కానుంది. ఆ సమయంలో ఒకవేళ ఐపీఎల్ 2021 ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటే.. కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్ ప్రాతినిథ్యం వహించే జట్లు ప్లేఆఫ్ చేరితే వాళ్లు టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటారా? లేదా ఐపీఎల్‌లోనే కొనసాగుతారా? అన్నది సందేహంగా మారింది. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం ఆటగాళ్ల ఇష్టానికే వదిలేసింది.

ఫేవరెట్లుగా హేల్స్, మలన్
ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలం గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో జరుగనుంది. మొత్తం 292 మంది ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. 8 ఫ్రాంచైజీలు మొత్తం కలిపి 61 మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. భారత ఆటగాళ్లతో పాటు విదేశీ స్టార్ క్రికెటర్లూ బరిలో నిలవడం ఆసక్తి రేపుతోంది. వేలంలో ఎక్కువగా ఆకర్షిస్తోంది ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలనే. ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్‌వన్ టీ20 ఆటగాడైన మలన్.. ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. అలెక్స్ హేల్స్ కూడా భారీ ధరకు పోయే అవకాశం ఉంది.

24 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం
చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 482 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ (5/60), రవిచంద్రన్ అశ్విన్ (3/53) దెబ్బకు ఇంగ్లండ్ 54.2 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కోహ్లీసేన 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. నాలుగు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమవగా.. మూడో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications
