Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Jos Buttler కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే భువీ చేతిలో గోల్డెన్ డక్

pandya

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా గురువారం జరుగుతున్న తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198పరుగులు చేసింది. ఇక 199పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. ఇరువైపులా స్వింగ్ చేస్తూ బౌలింగ్ చేసిన భువీ బౌలింగ్లో క్రీజులో తొలుత బ్యాటింగ్ చేసిన జాసన్ రాయ్ 3బంతులను డాట్ బాల్స్ ఆడాడు. ఇక నాలుగో బంతికి ఎలాగోలా సింగిల్ తీశాడు. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్‌గా తన అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న జాస్ బట్లర్.. భువీ బౌలింగ్లో అయిదో బంతిని ఎదుర్కొన్నాడు. ఇక అయిదో బంతికి భువీ అద్భుత ఇన్ స్వింగర్ వేయగా.. బట్లర్ వద్ద సమాధానం లేకపోయింది. క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఇక కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే గోల్డెన్ డక్ అయి చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.

ఇకపోతే ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున టీ20లో అరంగేట్రం చేసిన అర్షదీప్ సింగ్.. సైతం తన స్వింగ్‌తో తొలి ఓవర్లో ఆకట్టుకున్నాడు. రెండో ఓవర్ బౌలింగ్ వేసిన అర్షదీప్ సింగ్.. అంతర్జాతీయ కెరీర్లో తాను వేసిన మొదటి ఓవర్‌ను మొయిడిన్ వేశాడు. ఇక అతని బౌలింగ్లో రెండు పరుగులొచ్చినా.. అవి బాయ్స్ రూపంలో రావడంతో ఆ ఓవర్‌ను మెయిడిన్‌గానే పరిగణిస్తారు. ఇక బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. 5వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. అతని దెబ్బకు డేవిడ్ మలన్ (21పరుగులు) క్లీన్ బౌల్డ్ కాగా, లివింగ్ స్టోన్ (0) కీపర్ క్యాచ్‌గా డకౌట్ అయ్యాడు. ఇక 5ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా కమాండింగ్ పొజిషన్లో ఉంది. ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 29పరుగులు చేసింది. క్రీజులో జాసన్ రాయ్ (3), బ్రూక్ ఉన్నారు.

ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు బ్యాట్ ఝలిపించడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. దీపక్ హుడా (17బంతుల్లో 33), సూర్యకుమార్ యాదవ్ (19బంతుల్లో 39) దుమ్ముదులుపగా.. హార్దిక్ పాండ్యా (51పరుగులు 32బంతుల్లో) అంతర్జాతీయ కెరీర్లో తన తొలి హాఫ్ సెంచరీ చేయడంతో ఇండియాకు 198పరుగుల భారీ స్కోరు లభించింది.

Story first published: Friday, July 8, 2022, 1:24 [IST]
Other articles published on Jul 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+