Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బేస్ ప్రైస్ రూ 1.5 కోట్లు

England captain Joe Root gets green light to participate in this year's IPL

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018వ సీజన్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన ప్రధాన ఆటగాళ్లు ఏడు వారాల పాటు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఐపీఎల్ 2018లో ఆడే విషయమై ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

'గత రెండు సంవత్సరాల్లో టీ20 క్రికెట్‌ పెద్దగా ఆడలేదు. రెండేళ్లలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఉంది. ఈ ఏడాది ఐపీఎల్‌ ఆడితే నాకు కొంత సన్నాహకంగా ఉంటుంది. అందుకే ఐపీఎల్‌ ఆడాలనుకుంటున్నా' అని ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్ జో రూట్‌ పేర్కొన్నాడు.

జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా జరిగే ఐపీఎల్ వేలంలో వివిధ దేశాల నుంచి ఇప్పటికే సుమారు 1,122 మంది ఆటగాళ్లు తాము వేలానికి అందుబాటులో ఉంటామని బీసీసీఐకి తెలిపారు. ఇందులో ఇంగ్లాండ్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ 'గత రెండేళ్లలో నేను టీ20 క్రికెట్ ఎక్కువగా ఆడలేదు. మరో రెండేళ్లలో టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఉంది. ఇలాంటి సమయంలో ఐపీఎల్‌ ద్వారా నాకొక మంచి వేదిక దొరుకుతుంది. ఐపీఎల్ ఆడటం ద్వారా నా ఆటలో లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవచ్చు' అని అన్నాడు.

అంతేకాదు ఐపీఎల్‌లో పలు దేశాలకు చెందిన ఆటగాళ్లతో ఆడే అవకాశం కూడా దొరుకుతుందని జో రూట్ చెప్పుకొచ్చాడు. అందుకే ఈ ఏడాది ఐపీఎల్‌ ఆడాలని అనుకుంటున్నానని జో రూట్‌ తెలిపాడు. ఈ ఏడాది వేలంలో పాల్గొనేందుకు గాను జో రూట్‌ తన కనీస మద్దతు ధరను రూ.1.5 కోట్లుగా నిర్ణయించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 16, 2018, 18:03 [IST]
Other articles published on Jan 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+