న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పుడే పుట్టిన బాబుకు తన పేరు: అభిమానికి థ్యాంక్స్ చెప్పిన ఇంగ్లాండ్ కెప్టెన్

England Captain Eoin Morgan Thanks the Fan Who Names His Newborn After Him After CWC 2019 Triumph

హైదరాబాద్: ఇంగ్లాండ్‌ను తొలిసారి విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై అక్కడి అభిమానులు అమితమైన అభిమానాన్ని చూపిస్తున్నారు. తాజాగా జేమ్స్‌ అనే ఇంగ్లాండ్‌ వాసి అప్పుడే పుట్టిన తన బాబుకి హెన్రీ ఇయాన్‌ మోర్గాన్‌ అని పేరు పెట్టాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ "మోర్గాన్‌... ఈ రోజు ఉదయం 11 గంటలకు పుట్టిన మా బాబుకు హెన్రీ ఇయాన్‌ మోర్గాన్‌ అని మీ పేరే పెట్టాం. గత అదివారం మనదేశం క్రికెట్‌ జగజ్జేతగా నిలిచిన క్షణాలు నాకు తరచుగా గుర్తుకు రావాలనే ఉద్దేశంతోనే" అంటూ ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్‌ చేశాడు.

అభిమాని ట్వీట్‌కు స్పందించిన మోర్గాన్ తన ట్విట్టర్‌లో "అవునా! చాలా మంచి విషయం. మీ అభిమానానికి కృతజ్ఞతలు" అంటూ ట్వీట్‌ చేశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు. తద్వారా 44 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.

Story first published: Friday, July 19, 2019, 8:08 [IST]
Other articles published on Jul 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X