For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌కు గాయం: వరల్డ్‌కప్ ముంగిట ఇంగ్లాండ్‌కు భారీ ఎదురుదెబ్బ

England captain Eoin Morgan suffers injury scare ahead of World Cup 2019, sent to hospital for X-Ray

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం సర్వం సిద్ధమైంది. వార్మప్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఇలాంటి సమయంలో ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోన్న ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కుడి చేతి బోటన వేలికి తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే అతడిని స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మోర్గాన్‌కు ఎక్స్‌రే నిర్వహిస్తున్నారు. మోర్గాన్ గాయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా వెల్లడించలేదు.

గాయం తీవ్రవ ఎక్కువగా ఉంటే మోర్గాన్ ఈ టోర్నీకి దూరమవుతాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే గనుక జరిగితే తొలిసారి వన్డే వరల్డ్‌కప్ నెగ్గాలన్న ఇంగ్లాండ్ కల కలగానే మిగలనుంది. టోర్నీలో భాగంగా శనివారం ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. 1992లో ఆడిన జెర్సీతో ఈసారి ఇంగ్లాండ్ వరల్డ్‌కప్ బరిలోకి దిగుతోంది.

టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Story first published: Friday, May 24, 2019, 18:39 [IST]
Other articles published on May 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+