ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై వేటు

ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై వేటు పడింది. పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా మోర్గాన్‌పై ఒక వన్డే నిషేధంతో పాటు అతని మ్యాచ్ ఫీజులో కూడా కోత విధించారు. ఈ మేరకు ఐసీసీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగే వన్డేకు మోర్గాన్ దూరం కానున్నాడు.

ఒక మ్యాచ్ నిషేధం:
ఇంగ్లండ్ ప్రస్తుతం పాకిస్తాన్‌తో ఐదు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా బ్రిస్టల్ వేదికగా మూడో వన్డే జరిగింది. ఈ వన్డేలో స్లో ఓవర్ రేట్‌కు పాల్పడినందుకు మోర్గాన్‌పై ఒక వన్డే నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధిస్తూ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ నిర్ణయం తీసుకున్నాడు. మరోవైపు జట్టు సభ్యుల మ్యాచ్ ఫీజులో కూడా 20 శాతం కోత పడింది.

ఏడాదిలో రెండోసారి:
ఏడాది కాలంలో రెండోసారి స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడినందుకు మోర్గాన్‌పై మ్యాచ్ నిషేధం పడింది. గత ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మోర్గాన్ స్లో ఓవర్ రేట్‌కు కారణమయ్యాడు. ఒక మ్యాచ్ నిషేధంతో శుక్రవారం నాటింగ్‌హామ్ వేదికగా పాక్‌తో జరిగే నాలుగో వన్డేకు మోర్గాన్ దూరం కానున్నాడు.

బెయిర్‌స్టో విధ్వంసం:
మూడో వన్డేలో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (128; 93 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) ఐపీఎల్-12 ఫామ్‌ను కొనసాగిస్తూ మెరుపు శతకం సాధించాడు. 359 పరుగుల భారీ లక్ష చేధనను ఇంగ్లాండ్ 31 బంతులు ఉండగానే ఛేదించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఇంగ్లాండ్ ముందంజలో ఉంది. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (151; 131 బంతుల్లో 16 ఫోర్లు, 1సిక్సర్) శతకం చేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications