
అమ్ముడుపోని మోర్గాన్, ఫించ్
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రస్తుతం బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఆ జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. గత టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలిపించాడు. కానీ ఏ జట్టు కొనలేదు. అలాగే ఇంగ్లండ్ కెప్టెన్ ఇయన్ మోర్గాన్ కూడా ఇంగ్లండ్‌ను విజయంతంగా నడిపిస్తున్నాడు. గత సీజన్‌లో కెప్టెన్‌గా కోల్‌కతానైట్‌రైడర్స్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఇంగ్లండ్‌ను కెప్టెన్‌గా 2015 వన్డే ప్రపంచకప్‌ను కూడా గెలిపించాడు. అయినప్పటికీ మోర్గాన్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం లీగ్‌లో పలు జట్లకు కెప్టెన్‌లు కావాల్సి ఉన్నప్పటికీ ఏ జట్టు కూడా వీరిని కొనుగోలు చేయకపోవడం గమనార్హం.

ఫించ్ అమ్ముడుపోక పోవడానికి కారణమిదే
గతంలో ఐపీఎల్‌లో ఆరోన్ ఫించ్ పెదగా రాణించలేదు. అతని రికార్డులు అంతగా బాగాలేవు. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా ప్రస్తుతం ఫించ్ గొప్ప ఫాంలో కూడా లేడు. ఈ కారణంతోనే ఫించ్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టు ఆసక్తి చూపలేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఆరోన్ ఫించ్ మెగా వేలానికి కోటి 50 లక్షల రూపాయల బేస్ ప్రైజ్‌తో వచ్చాడు. అలాగే అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా బ్యాటర్ లబుశేన్ కూడా మెగా వేలంలో అమ్ముడుపోలేదు.

మోర్గాన్ అమ్ముడుపోక పోవడానికి కారణమిదే
ఇక ఇయాన్ మోర్గాన్ విషయానికొస్తే ఏడాది కాలంగా మోర్గాన్ ఫేలవ ఫాంలో ఉన్నాడు. గత సీజన్లో కోల్‌కతాను ఫైనల్ చేర్చినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం విఫలమయ్యాడు. ఈ కారణంతోనే కోటి రూపాయల బేస్‌ప్రైజ్‌తో ఉన్న మోర్గాన్‌ను వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరో అవకాశం
అయితే ఇప్పటివరకు అమ్ముడుపోని ఆటగాళ్లందరినీ మెగా వేలంలో చివరన మరోసారి వేలంలోకి తీసుకురానున్నారు. అప్పుడు కూడా ఏ జట్టు కొనుగోలు చేయకపోతే ఈ సీజన్‌లో ఇక వీరిద్దరు కనిపించరు.
దీంతో ఆరోన్ ఫించ్, ఇయాన్ మోర్గాన్ అభిమానులు అప్పుడైన ఏదో ఒక జట్టు వీరిని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు.

అమ్ముడు పోని ఆటగాళ్లు
కాగా రెండో రోజు ఐపీఎల్ మెగా వేలంలో వీరిద్దరితో పాటు పలువురు ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. భారత్‌కు చెందిన చటేశ్వర్ పుజారా, కరణ్ శర్మ, ఇష్ సోధీ, పీయూష్ చావ్లా, షంసీ ఇషాంత్ శర్మను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. అలాగే విదేశాలకు చెందిన క్రిస్ జోర్దాన్, నీషమ్‌ను కూడా ఏ జట్టు కొనలేదు. అయితే వీరందరికీ వేలం చివర్లో మరో అవకాశం కల్పించనున్నారు.


Click it and Unblock the Notifications












