Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'బెన్ స్టోక్స్ లేకున్నా ఇంగ్లాండ్ యాషెస్ సిరిస్ గెలుస్తుంది'

హైదరాబాద్: నవంబర్ 23 నుంచి ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌పై ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేకుండా కూడా ఇంగ్లాండ్ జట్టు యాషెస్ సిరీస్‌ను గెలుస్తుందని వ్యాఖ్యానించాడు.

బీబీసీ రేడియో ఫైవ్‌కి ఇచ్చిన ఇంటర్యూలో 'బెన్ స్టోక్స్ లేకుండా ఇంగ్లాండ్ లేదనే వ్యాఖ్యలు అర్థరహితం. అటువంటి మితిమీరిన అంచనాలు కూడా తప్పు. స్టోక్స్ లేకుండా ఇంగ్లాండ్ యాషెస్‌ను గెలుస్తుంది. ఇంగ్లాండ్ జట్టులో బెన్ స్టోక్స్ లేడు కాబట్టి ఆసీస్‌‌కే విజయావకాశాలు ఎక్కువ' అనే మాటలు మంచిది కాదని అన్నాడు.

England can win Ashes without Stokes: Mitchell Johnson

'నేను ఇంకా యాషెస్‌ను ఆసీస్ గెలుస్తుందనే నమ్మకంతోనే ఉన్నా. కానీ మన జట్టు ప్రదర్శన ఇటీవల కాలంలో చెప్పుకోదగిన విధంగా లేదు. అలా అని ఇంగ్లాండ్ కూడా అద్భుతమైన విజయాల్ని ఏమీ సాధించలేదు. ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయం. ఇంగ్లాండ్ జట్టు మొత్తం ప్రదర్శనపై మన ఆటగాళ్లు దృష్టి పెడితే మంచిది' అని జాన్సన్ అన్నాడు.

బెన్ స్టోక్స్ విషయాన్ని పక్కకుపెట్టి సిరీస్ గెలవడం గురించి ఆలోచించాలని ఆసీస్ క్రికెటర్లకు హితవు పలికాడు. కాగా, బెన్ స్టోక్స్ లేకుండా కీలక ఆటగాడు లేకుండా ఇంగ్లాండ్ జట్టు యాషెస్ సిరీస్‌ను గెలవలేదని ఇయాన్ చాపెల్, స్టీవ్ వా లాంటి ఆసీస్ దిగ్గజ క్రికెటర్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, 2013-14లో జరిగిన యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా క్లీన్ స్వీ చేయడంలో మిచెల్ జాన్సన్ కీలకపాత్ర పోషించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+