T20 World Cup 2022: ఐదు వికెట్లతో సామ్ కరన్ అద్భుత ప్రదర్శన..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పెర్త్‌లో శనివారం జరిగిన T20 ప్రపంచకప్‌లో సామ్ కరన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆఫ్ఘానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తీశాడు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయం సరైందని బౌలర్లు నిరూపించారు. ఆఫ్ఘనిస్థాన్ ను 19.4 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌట్ చేశారు.
మార్క్ వుడ్
గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌లో పరాజయం పాలైన ఇంగ్లాండ్, 18.1 ఓవర్లలో తమ లక్ష్యాన్ని ఛేధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆప్ఘానిస్థాన్ ఇన్నింగ్స్ లో మూడో ఓవర్‌లో తొలి వికెట్ కోల్పోయింది. మార్క్ వుడ్ వికెట్ తీసి ఆఫ్ఘాన్ పతనాన్ని ప్రారంభించాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆల్-రౌండర్ బెన్ స్టోక్స్ తన మొదటి ఓవర్ లోనే వికెట్ తీశాడు.
లివింగ్‌స్టోన్
లేట్ గా బౌలింగ్ కు వచ్చిన సామ్ కరన్ బాగా బౌలింగ్ చేశాడు. కరాన్ మూడో ఓవర్ లో రెండు వికెట్లు తీశాడు. అతను మొత్తం ఐదు వికెట్లు తీశాడు. స్టోక్స్, మార్క్ వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు బట్లర్ (18), అలెక్స్ హేల్స్ (19) త్వరగా ఔటయ్యారు. లివింగ్‌స్టోన్ 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications