భారత్‌తో సెమీ ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్ - దెబ్బ మీద దెబ్బ..!!

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సెమీ ఫైనల్స్‌కు ముహూర్తం సమీపిస్తోంది. ఇంకొన్ని గంటల్లో తొలి సెమీ ఫైనల్ ఆరంభం కాబోతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఇందులో న్యూజిలాండ్-పాకిస్తాన్ తలపడబోతోన్నాయి. ఈ మెగా ఈవెంట్ సెమీ ఫైనల్స్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన బ్లాక్ క్యాప్స్‌తో ఢీ కొట్టబోతోంది పాకిస్తాన్.

ఎల్లుండి రెండో సెమీఫైనల్..
రెండో సెమీ ఫైనల్ ఎల్లుండి షెడ్యూల్ అయింది. అడిలైడ్ ఓవల్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే పోరు ఇది. ఈ రెండు జట్లు కూడా ఫైనల్‌పై కన్నేశాయి. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా టోర్నమెంట్‌లో అడుగు పెట్టాయి. ఈ నెల 13వ తేదీన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఫైనల్ జరుగుతుంది. ఈ రెండు జట్లు కూడా సూపర్ 12 దశలో సత్తా చాటాయి.

ఊహించని షాక్..
కాగా భారత్‌తో సెమీ ఫైనల్స్ కోసం సమాయాత్తమౌతోన్న ఇంగ్లాండ్‌ను ఊహించని షాక్ తగిలింది. డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలన్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మలన్.. గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. నెట్ ప్రాక్టీస్‌కు కూడా దూరంగా ఉంటోన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతను అర్ధాంతరంగా గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. 15వ ఓవర్‌లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో గజ్జల్లో నొప్పితో డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నాడు.

ఫాస్ట్ బౌలర్‌కు ఫిట్‌నెస్ సమస్య..
డేవిడ్ మలన్ స్థానంలో ఫిల్ సాల్ట్‌ను జట్టులోకి తీసుకోవడం దాదాపుగా ఖాయమైంది. అతణ్ని నంబర్ 3 స్థానంలో పంపించనుంది. ఈ సమస్య తీరిపోయిందని సంతోషించే లోపే మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ రూపంలో. భారత్‌తో సెమీ ఫైనల్‌లో మార్క్ వుడ్ ఆడేది అనుమానమే. అతను ఫిట్‌నెస్ సమస్యను ఎదుర్కొంటోన్నాడు. ఈ ఇబ్బందితోనే ట్రైనింగ్ సెషన్స్ నుంచి అర్ధాంతరంగా డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నాడు. మళ్లీ ప్రాక్టీస్‌కు వెళ్లలేదు.

వందశాతం ఫిట్‌నెస్ ఉంటేనే..
వందశాతం ఫిట్‌నెస్‌తో ఉంటేనే మార్క్ వుడ్.. సెమీస్‌లో ఆడే అవకాశం ఉంది. లేదంటే అతని స్థానంలో మరో కొత్త బౌలర్‌ను వెదుక్కోవాల్సిన పరిస్థితి ఇంగ్లాండ్ జట్టుకు ఎదురవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఈ టోర్నమెంట్‌లో మార్క్ వుడ్ సత్తా చాటాడు. ఇప్పటివరకు తొమ్మిది వికెట్లను పడగొట్టాడీ ఫాస్ట్ బౌలర్. సెమీ ఫైనల్‌లో బలమైన భారత జట్టును ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మార్క్ వుడ్ ఆడేది అనుమానం కావడంతో ఇంగ్లాండ్ కష్టాలను మరింత పెంచినట్టయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications