Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: ఆఫ్ఘానిస్థాన్‍ను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 5 వికెట్ల తేడాతో విజయం..

 England beat Afghanistan by 5 wickets in T20 World Cup

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పెర్త్ లో జరిగిన సూపర్-12 మ్యాచ్ లో ఆఫ్ఘానిస్థాన్ పై ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఆప్ఘాన్ ఆటగాళ్లు ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో 19.4 ఓవర్లలో 112 పరుగులకు ఆఫ్ఘాన్ ఆలౌట్ అయింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ తక్కువ పరుగులకే ఔటయ్యారు. హజ్రతుల్లా జజాయ్ 7 పరుగులు చేయగా అతడిని స్టోక్స్ ఔట్ చేశాడు. 10 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్బాజ్ మార్క్ వుడ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.

ఇబ్రహీం జద్రాన్

ఇబ్రహీం జద్రాన్

ఆ తర్వాత వచ్చిన ఇబ్రహీం జద్రాన్, ఉస్మాన్ ఘనీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 32 బంతుల్లో ఒక సిక్స్, మూడు ఫోర్లతో 32 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్ సామ్ కరన్ బౌలింగ్ మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నజీబుల్లా జద్రాన్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ మహ్మద్ నబీ కేవలం 3 పరుగులే చేసి మార్క్ వుడ్ కు చిక్కాడు. ఉస్మాన్ ఘనీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వేగంగా ఆడే క్రమంలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 8 పరుగులు చేసి సామ్ కరన్ బౌలింగ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

సామ్ కరన్

సామ్ కరన్

ఈ తర్వాత వచ్చిన రషీద్ ఖాన్ డౌక్ ఔట్ అయ్యాడు. మరో ఆటగాడు ముజీబ్ ఉర్ రెహమాన్ కూడా డౌక్ ఔటయ్యాడు. సహచారులు ఔట్ అవుతున్నా ఉస్మాన్ ఘనీ పట్టువదలకుండా ఆడాడు. చివరికి 28 బంతుల్లో 30 పరుగులు చేసి సామ్ కరన్ బౌలింగ్ క్యాచి ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన ఫారుకీ సామ్ కరన్ బౌలింగ్ లోక్యాచ్ ఔటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ 3.4 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. బెన్ స్టోక్స్, మార్క్ వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశాడు.

ఇంగ్లాండ్ ఓపెనర్లు

ఇంగ్లాండ్ ఓపెనర్లు

113 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జోస్ బట్లర్ 18 పరుగులు చేసి ఔట్ కాగా.. మరో ఓపెనర్ హెల్స్ 19 పరుగులకు పెవిలియన్ చేరాడు. డెవిడ్ మలాన్ 18 పరుగులు చేయగా.. బెన్ స్టోక్స్ 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. బ్రూక్ కూడా 2 పరుగులకే ఔటయ్యాడు. లివింగ్ స్టోన్,మొయిన్ అలీతో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. లివింగ్ స్టోన్ 21 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫారుకీ,రహ్మన్, రషీద్ ఖాన్, మాలిక్, నబీ ఒక్కో వికెట్ తీశారు.

Story first published: Saturday, October 22, 2022, 19:55 [IST]
Other articles published on Oct 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+