Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డబుల్ సెంచరీతో 81 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టిన అలెస్టర్ కుక్

England batsman Alastair Cook joins elite list with stunning Ashes double century

హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 83 పరుగులు మాత్రమే చేసి విమర్శలు ఎదుర్కొంటున్న కుక్ బాక్సింగ్ డే టెస్టులో తానెంటో నిరూపించాడు.

ఇంగ్లాండ్ Vs ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టు స్కోరు కార్డు

ఓవర్ నైట్ స్కోరు 104 పరుగులతో గురువారం బ్యాటింగ్‌ను ప్రారంభించిన అలెస్టర్ కుక్ 153 పరుగుల వద్ద ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ లైఫ్ ఇచ్చిన లైఫ్‌ని సద్వినియోగం చేసుకుని కుక్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 361 బంతుల్లో 23 ఫోర్ల సాయంతో డబుల్ సెంచరీని నమోదు చేశాడు.

టెస్టుల్లో కుక్‌కు ఇది ఐదో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ డబుల్ సెంచరీతో కుక్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కుక్‌ 150 వ‍్యక్తిగత పరుగుల మార్కును చేరిన సమయంలో మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారాల సరసన నిలిచాడు.

ఆతిథ్య జట్టుపై 150కిపైగా పరుగుల్ని అత్యధిక సార్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ టెండూల్కర్, బ్రియాన్ లారా, జాక్‌ హోబ్స్‌ల సరసన కుక్ నిలిచాడు. ఈ జాబితాలో సచిన్‌, లారాలు మూడేసి సార్లు ఆ ఘనత సాధించి రెండో స్థానంలో ఉండగా, ఇప్పుడు వారి సరసన కుక్‌ చేరాడు.

1936 తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్‌గా అలెస్టర్ కుక్ అరుదైన ఘనత సాధించాడు. 1936లో ఇంగ్లాండ్‌కు చెందిన వాల్లీ హమ్మండ్ రెండు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. కాగా, ఈ ఏడాది వెస్టిండిస్‌తో బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన టెస్టులో కుక్ 243 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్‌పై ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 209 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తాజాగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 491 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కుక్ (244 నాటౌట్), జేమ్స్ ఆండర్సన్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై ఇంగ్లాండ్ 164 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Story first published: Thursday, December 28, 2017, 13:13 [IST]
Other articles published on Dec 28, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+