రాజ్‌కోట్ వేదికగా రేపటి నుంచి భారత్‌తో జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. గత రెండు టెస్టుల ప్రారంభానికి ఒక్కరోజు ముందుగానే తుదిజట్టును వెల్లడించిన ఇంగ్లండ్ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అయితే మూడో టెస్టు తుదిజట్టులో ఇంగ్లండ్ కీలక మార్పులు చేసింది. ఇద్దరు పేసర్లు అండర్సన్, మార్క్‌వుడ్ జట్టులోకి వచ్చారు.
తొలి రెండు టెస్టుల్లో ఒక్క పేసర్‌తోనే ఇంగ్లండ్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఉప్పల్ టెస్టులో మార్క్ వుడ్‌ను, వైజాగ్ టెస్టులో అండర్సన్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ మూడో టెస్టు తుదిజట్టులో వైజాగ్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన షోయబ్ బషీర్ స్థానంలో మార్క్ వుడ్ వచ్చాడు. మరోవైపు వీసా సమస్యలతో ఇబ్బంది పడిన యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీతో పాటు జో రూట్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.

రాజ్‌కోట్ టెస్టుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఎంతో స్పెషల్ కానుంది. తన కెరీర్‌లో స్టోక్స్ రేపు 100వ టెస్టు ఆడనున్నాడు. కాగా, తొలి రెండు టెస్టుల్లో భారత్, ఇంగ్లండ్ చెరో మ్యాచ్ గెలిచి 1-1తో అయిదు టెస్టుల సిరీస్‌లో సమంగా ఉన్న విషయం తెలిసిందే. మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యానికి దూసుకెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
ఇంగ్లండ్ తుది జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్/కుల్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.