Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతడిపై వేటు.. తుదిజట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

విశాఖపట్నం వేదికగా భారత్‌తో రేపటి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది. తొలి టెస్టు తరహాలోనే మ్యాచ్ ఆరంభానికి ఒక రోజు ముందే ఇంగ్లాండ్ తుదిజట్టును వెల్లడించింది. అయితే జట్టులో కీలక మార్పులు చేసింది. గాయంతో జాక్ లీచ్ రెండో టెస్టుకు దూరమవ్వడంతో అతడి స్థానంలో షోయబ్ బషీర్ అవకాశం దక్కించుకున్నాడు.

వైజాగ్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నాడు. వీసా సమస్యల కారణంగా ఈ యువ స్పిన్నర్ భారత్‌కు ఆలస్యం చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఉప్పల్ టెస్టుకు దూరమయ్యాడు. అయితే ఇంగ్లాండ్ తమ జట్టులో మరో కీలక మార్పు చేసింది. తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన మార్క్ వుడ్‌పై వేటు వేసింది. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చింది.

England announced playing XI For 2nd Test Against England James Anderson back to team

అండర్సన్‌కు భారత్ పిచ్‌లపై అనుభవం ఉంది. అతడి కెరీర్‌లో టెస్టు ఫార్మాట్ కోసం భారత్‌కు రావడం ఇది ఆరోసారి. 2006, 2008, 2012, 2016, 2021, 2024 ఇండియా పర్యటనల్లో అతడు ఇంగ్లాండ్ జట్టులో ఉన్నాడు. అయితే నెట్స్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. తొలి టెస్టులో స్టోక్స్ బౌలింగ్ చేయలేదు. కానీ వైజాగ్ టెస్టులో అవసరమైతే బంతితో రాణించాలని సాధన చేశాడు. కాగా, ఉప్పల్ టెస్టులో భారత్‌పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

England announced playing XI For 2nd Test Against England James Anderson back to team

ఇంగ్లాండ్ తుది జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్

భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రజత్ పటిదార్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్

Story first published: Thursday, February 1, 2024, 14:15 [IST]
Other articles published on Feb 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+