England Playing 11 : సామ్ బిల్లింగ్స్ ఔట్.. బెన్ ఫోక్స్ ఇన్, సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఆడే ఇంగ్లాండ్ టీం..!

లండన్‌లోని ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో బుధవారం (రేపటి) నుంచి దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక రేపు మొదలు కానున్న తొలి టెస్టు కోసం ఇంగ్లాండ్ టీం.. తమ తుది జట్టు (ప్లేయింగ్ ఎలెవన్)ను ప్రకటించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో గత నెల జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ ఐదో టెస్టులో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టే దాదాపుగా తొలి టెస్ట్‌లో బరిలోకి దిగబోతుంది. అయితే ఒక్క మార్పు మాత్రం చోటుచేసుకుంది. కీపర్ సామ్ బిల్లింగ్స్ స్థానంలో.. మరో కీపర్ బెన్ ఫోక్స్ తిరిగి జట్టులోకి ఎంపికయ్యాడు.

బాజ్ బాల్ అంతు చూస్తాం : డీన్ ఎల్గర్
జూన్‌లో కరోనా పాజిటివ్ బారిన పడడంతో ఫోక్స్ కొన్ని మ్యాచ్‌లకు మిస్సయ్యాడు. ఆ తర్వాత అతని స్థానంలో సామ్ బిల్లింగ్స్‌ని జట్టులోకి తీసుకున్నారు. ఇక కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇంగ్లాండ్ ఓటమి ఎరుగకుండా టెస్టుల్లో హవా చూపిస్తుంది. వీరిద్దరి ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఇంగ్లాండ్ ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఇకపోతే దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ సారథ్యంలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ఆ జట్టు సన్నద్ధమైంది. ఇక తమ బౌలర్లకు వ్యతిరేకంగా ఇంగ్లీష్ బ్యాటర్లు బాజ్‌బాల్ తరహాలో ఎలా ఆడతారో చూడాలని తాను ఆసక్తిగా ఉన్నానని ఎల్గర్ చెప్పాడు. ఈ బాజ్‌బాల్ విధానమేంటో దీని అంతు తేల్చుతామన్నట్లు డీన్ ఎల్గర్ చెప్పకనే చెప్పాడు. ఇక ప్రోటీస్ బౌలర్లు టెస్టుల్లో చాలా పకడ్బందీగా బౌలింగ్ చేస్తారనే సంగతి తెలిసిందే.

లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌దే ఆధిపత్యం
ఇక ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు లార్డ్స్‌లో 16టెస్టు మ్యాచ్‌లు ఆడాయి. ఇంగ్లాండ్ ఏడింటిలో విజయం సాధించి దక్షిణాఫ్రికాపై ఆధిపత్యం చలాయించింది. దక్షిణాఫ్రికా అయిదు మ్యాచ్‌లు గెలువగా.. నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ రెండు జట్లు చివరిసారిగా జూలై 2017లో లార్డ్స్‌లో తలపడ్డాయి. అప్పుడు ఇంగ్లాండ్ 211పరుగుల తేడాతో విజయం సాధించింది. అప్పుడు కూడా దక్షిణాఫ్రికా జట్టుకు డీన్ ఎల్గర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టు :
టాపార్డర్ - జాక్ క్రాలీ, అలెక్స్ లీస్, ఒల్లీ పోప్,
మిడిలార్డర్ - జో రూట్, జానీ బెయిర్‌స్టో,
లోయర్ ఆర్డర్ - బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్),
లోయర్ ఆర్డర్ (బౌలర్లు) - స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, మాథ్యూ పాట్స్, జేమ్స్ ఆండర్సన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications