న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2023 వేసవిలో ప్రతీకారం తీర్చుకునేందుకు ఇంగ్లాండ్ సిద్ధం.. యాషెస్ సిరీస్ షెడ్యూల్‌ను ప్రకటించిన ఆ దేశ బోర్డు

England Announced Ashes test Series Schedule 2023, Complete Details are Here

ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్, ఐర్లాండ్‌తో ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు.. 2023 వేసవిలో ఇంగ్లాండ్ టీం ఫుల్ క్రికెట్ షెడ్యూల్‌తో బిజీబిజీగా ఉండనుంది. ఈ మేరకు స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఇంగ్లాండ్ ప్రకటించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు జూన్ 1 నుంచి జూన్ 4వరకు ఐర్లాండ్‌తో ఒక ఆఫ్ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్‌లో ఆడుతుంది.

తద్వారా వేసవి సీజన్ ప్రారంభమవుతుంది. 2021-2022లో ఆస్ట్రేలియాలో చేతిలో 0-4 తేడాతో యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఎలాగైనా యాషెస్‌ను తిరిగి కైవసం చేసుకోవడానికి ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌‌ను ప్రతీకార సిరీస్‌గా ఇంగ్లాండ్ భావించనుంది.

ఇక యాషెస్ సిరీస్లో భాగంగా టెస్ట్ మ్యాచ్‌లు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్, ది ఓవల్‌ వేదికలుగా జూన్ 16 నుంచి జూలై 31 మధ్య జరుగుతాయి. ఇంగ్లాండ్ టీం న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్లు కూడా ఆడనుంది. ఇందులో భాగంగా నాలుగు టీ20లు, నాలుగు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది.

న్యూజిలాండ్ పర్యటన ఆగస్టు 30 నుండి సెప్టెంబరు 15వరకు జరగనుంది. భారత్‌లో జరగనున్న ఐసీసీ మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ 2023కు ముందు ఇంగ్లాండ్ సన్నాహకంగా సెప్టెంబర్ 20 నుండి 26వరకు ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌ను కూడా ఆడనుంది.

2023 వేసవిలో ఇంగ్లాండ్ యాషెస్ షెడ్యూల్‌
జూన్ 1 - జూన్ 4: వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్, ఇంగ్లాండ్ వర్సెస్ ఐర్లాండ్, లార్డ్స్
జూన్ 16 - జూన్ 20: యాషెస్ తొలి టెస్ట్, ఎడ్జ్‌బాస్టన్
జూన్ 28 - జులై 2: రెండో టెస్ట్, లార్డ్స్
జూలై 6 - జూలై 10: మూడో టెస్ట్, హెడ్డింగ్లీ
జూలై 19 - జూలై 23: నాలుగో టెస్ట్, ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్
జూలై 27 - జూలై 31 : 5వ టెస్ట్,

Story first published: Thursday, September 22, 2022, 15:14 [IST]
Other articles published on Sep 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X