England vs Southafirca Test Series : ఫియర్‌లెస్ క్రికెట్ ఫార్ములా కొనసాగించే ఇంగ్లాండ్ జట్టు ఇదే..!

ఆగస్ట్ 17 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు టెస్టుల కోసం ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) మంగళవారం 14మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇటీవల ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్.. గత 4 టెస్టుల్లో విజయవంతమైన జట్టునే దాదాపు కొనసాగించింది. గాయపడిన జేమీ ఓవర్టన్ స్థానంలో.. ఓలి రాబిన్సన్ జట్టులోకి వచ్చాడు. వెన్నునొప్పి కారణంగా మార్చిలో వెస్టిండీస్‌లో జరిగే టెస్ట్ టూర్‌కు మిస్సయిన తర్వాత మళ్లీ టెస్ట్ జట్టులో ఓలీ చోటు సంపాదించలేకపోయాడు.
జనవరిలో జరిగిన చివరి యాషెస్ టెస్టులో రాబిన్సన్ చివరిసారిగా టెస్ట్ ఆడాడు. కౌంటీ ఛాంపియన్ షిప్లో సస్సెక్స్ తరఫున ఆడే రాబిన్సన్.. గత వారం నాటింగ్‌హామ్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్వన కనబర్చి సెలెక్టర్ల కళ్లల్లో పడ్డాడు. ఇకపోతే వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ తిరిగి జట్టులోకి రావడంతో సామ్ బిల్లింగ్స్ జట్టు నుంచి తప్పుకోక తప్పలేదు. కోవిడ్-19 కారణంగా ఫోక్స్ న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో అలాగే ఆ తర్వాత రీషెడ్యూల్ చేసిన భారత్‌తో జరిగిన టెస్టులో కూడా ఆడలేదు. అతని స్థానంలో సామ్ బిల్లింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.

గత టెస్ట్ సిరీస్‌లు దృష్టిలో ఉంచుకుని సెలెక్షన్
'బ్రెండన్ మెకల్లమ్, బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ సమ్మర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి మంచి ఆరంభం అందుకుంది. న్యూజిలాండ్, ఇండియా లాంటి జట్లను ఓడించింది. మేము ఇప్పుడు బలమైన దక్షిణాఫ్రికా జట్టుతో టెస్ట్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాం. లార్డ్స్, ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే మొదటి రెండు టెస్టుల కోసం సెలక్టర్లు గత టెస్ట్ సిరీస్లో జట్టు సమతూకాన్ని దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేశారు' అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మెన్స్ పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ మో బోబాట్ అధికారిక ప్రకటనలో తెలిపారు.

కొనసాగుతున్న దక్షిణాఫ్రికా ఆధిపత్యం
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఆ జట్టు (71.43శాతం విన్నింగ్ పర్సంటేజీ)తో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక ఆస్ట్రేలియా (70శాతం విన్నింగ్ పర్సంటేజీ)తో రెండో స్థానంలో ఉంది. 3వ స్థానంలో శ్రీలంక జట్టు (53.33 విన్నింగ్ పర్సంటేజీ), 4వ స్థానంలో భారత్ (52.08విన్నింగ్ పర్సంటేజీ), 5వ స్థానంలో పాకిస్థాన్ (51.85), ఆరోస్థానంలో వెస్టిండీస్ (50), ఇక చివర్లో వరుసగా 7, 8, 9 స్థానాల్లో ఇంగ్లాండ్ (33.33), న్యూజిలాండ్ (25.93), బంగ్లాదేశ్ (13.13) విన్నింగ్ పర్సంటేజీలతో కొనసాగుతున్నాయి. ఇక దక్షిణాఫ్రికా ఆధిపత్యానికి ఇంగ్లాండ్ గండి కొడుతుందో లేదో చూడాలి.

దక్షిణాఫ్రికాతో తొలి రెండు టెస్టులకు ఎంపికైన ఇంగ్లాండ్ జట్టు
:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్‌టన్, మాథ్యూ పాట్స్, ఆలీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications