న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు నాకొద్దు.. విలియమ్సన్‌కు ఇవ్వండి

Ben Stokes Turns Down ‘New Zealander Of Year’ Award Nomination For Kane Williamson ! || Oneindia
England Allrounder Ben Stokes turns down nomination for New Zealander of the Year, supports Kane Williamson

'న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపికయినందుకు సంతోషంగా ఉంది. ఆ అవార్డు నాకు వద్దు. న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌కు ఇవ్వండి అని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్‌ కోరుతున్నాడు. ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో స్టోక్స్‌ అద్భుత పోరాటం చేసి ఇంగ్లండ్ 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాడు. ఫైనల్ మ్యాచ్‌లో 84 పరుగులతో, సూప‌ర్ ఓవ‌ర్‌లోనూ కీల‌క పరుగులు చేసి కివీస్‌కు కప్ దూరం చేసిన స్టోక్స్‌.. ఆ దేశ‌ అవార్డుకు నామినేట్ అయ్యాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

స్వతహాగా న్యూజీల్యాండర్:

స్వతహాగా న్యూజీల్యాండర్:

బెన్ స్టోక్స్‌ వాస్తవానికి న్యూజీల్యాండర్. క్రైస్ట్‌చర్చ్‌లో పుట్టిన స్టోక్స్ 12 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఇంగ్లండ్‌కు వలస వచ్చాడు. స్టోక్స్ తండ్రి గెరార్డ్ స్టోక్స్ గతంలో న్యూజీల్యాండ్ రగ్బీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌లోని ఒక రగ్బీ జట్టుకు కోచ్‌గా పనిచేసేందుకు కుటుంబంతో సహా వలస వచ్చాడు. బెన్ స్టోక్స్‌కు ఇంగ్లండ్‌లోనే క్రికెట్ కోచింగ్ ఇప్పించాడు. స్టోక్స్ స్వతహాగా న్యూజీల్యాండర్ కావడంతో ఆ దేశం ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది.

న్యూజిలాండ్ కోసం చాలా చేసారు:

న్యూజిలాండ్ కోసం చాలా చేసారు:

తాజాగా స్టోక్స్ న్యూజీల్యాండర్ అవార్డుకు ఎంపిక కావడంపై తన ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. 'న్యూజిలాండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం నామినేట్ అవడం పట్ల సంతోషంగా ఉన్నా. న్యూజిలాండ్, మ‌వోరి వారసత్వం గురించి నేను గర్వపడుతున్నా. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు అర్హత ఉన్న వారు చాలా మంది ఉన్నారు, వారందరూ న్యూజిలాండ్ దేశం కోసం చాలా చేసారు' అని స్టోక్స్ తెలిపారు.

నా ఓటు కూడా అతనికే:

నా ఓటు కూడా అతనికే:

'ఇంగ్లాండ్ ప్రపంచకప్ సాధించడానికి నా వంతు సహాయం చేసాను. నా జీవితం ఎక్కువగా యూకేలో గడిచింది. 12 సంవత్సరాల వయస్సు నుండి ఇక్కడే ఉంటున్నా. న్యూజిలాండ్‌ సారథి కేన్ విలియమ్సన్‌కు దేశం మొత్తం మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా. అతను కివీస్ లెజెండ్. విలియమ్సన్‌ జట్టును అద్భుతంగా నడిపించాడు. టోర్నీ టాపర్. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ప్రతి సందర్భంలో గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. ఈ అవార్డుకు అతను అర్హుడు. నా ఓటు కూడా విలియమ్సన్‌కే' అని స్టోక్స్ చెప్పుకొచ్చారు.

ఐపీఎల్‌లో అత్యధిక ధరకు :

2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన స్టోక్స్ బౌలింగ్, బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లండ్ జట్టు గొప్ప ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరుతెచ్చుకున్నాడు. అతని కాలంలోనే స్టార్ ప్లేయర్ అయ్యాడు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన విదేశీ ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో కూడా 66.2 సగటుతో 465 పరుగులు చేసిన స్టోక్స్.. 7 వికెట్లు కూడా తీసి ఇంగ్లండ్ విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు.

Story first published: Tuesday, July 23, 2019, 17:03 [IST]
Other articles published on Jul 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X