Eoin Morgan Retirement : అందులో పెద్ద ఆశ్చర్యమేముంది.. అతని పని అయిపోయిందనుకున్నాడు : మొయిన్ అలీ

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. అంతర్జాతీయ క్రికెట్‌కు రేపు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడనే వార్తలు ఈరోజు మధ్యాహ్నం నుంచి చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయమై ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ స్పందించాడు. 35ఏళ్ల మోర్గాన్ తన క్రికెట్ కెరీర్ పూర్తయిందనుకున్నాడని అభిప్రాయపడ్డాడు. మోర్గాన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కాబోతున్నట్లు బ్రిటిష్ వార్తా వెబ్ సైట్లు వార్తలు గుప్పించడంతో క్రికెట్ ప్రపంచంలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇక బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్ ప్రోగ్రాంలో ఈ వార్తలపై మొయిన్ అలీ తన అభిప్రాయాలను తెలియజేశాడు. మొయిన్ అలీ మాట్లాడుతూ.. 'మోర్గన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ పూర్తి చేసినట్లు అతను స్పష్టంగా ఫీల్ అవుతున్నాడు. అతనికి ఎల్లప్పుడు జట్టే ముందు.. తర్వాతే వ్యక్తిగత విషయాలు. అతను ఎంత నిస్వార్థపరుడో మనకు తెలుసు. అతను ఇంగ్లాండ్ తరఫున అద్భుతమైన కెప్టెన్. అతను కచ్చితంగా ఇంగ్లాండ్‌కు దొరికిన ఆల్ టైం అత్యుత్తమ కెప్టెన్.' అని పేర్కొన్నాడు.
'మోర్గన్ రిటైర్మెంట్ ప్రకటించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఇక ఈ ఏడాది చివరిలో టీ20 ప్రపంచ కప్ ఉండడంతో అతను అంతలోపు తన తర్వాత ఓ మంచి టీ20 కెప్టెన్‌ను చూడాలనుకుంటున్నాడు. అతను మాకు సరైన కెప్టెన్. గెలవాలంటే ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. ప్రస్తుతం అతను లేకుండా జట్టులో ఉండడం నిజంగా చాలా వింతగా ఉంటుంది. అయినప్పటికీ సహజంగానే మ్యాచ్‌లు ముందుకు సాగుతాయి. రోజులు గడిచే కొద్దీ అలవాటైపోతుంది. కానీ మోర్గన్ రిటైర్మెంట్ కాస్త విచారకరమే. అతను నిస్వార్థ పూరిత వ్యక్తి కాబట్టి తనకంటే ఎక్కువగా జట్టు గురించి ఆలోచిస్తాడు. సంవత్సరాలుగా ఇంగ్లాండ్ జట్టు చాలా బలంగా కన్పిస్తోంది. అతన్ని భర్తీ చేసే ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. అందుకే బహుశా తన టైం ముగిసిందని అతను భావిస్తూ ఉండొచ్చు. అతను జోస్ బట్లర్ లేదా మరెవరైన కెప్టెన్ అయి నిలదొక్కుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలనుకుంటున్నాడు' అని అలీ తెలిపాడు.
ఇకపోతే 2019లో ఇంగ్లాండ్ తొలిసారి వన్డే ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ టీంకు కెప్టెన్‌గా మోర్గన్ వ్యవహరించాడు. ఇంగ్లాండ్ తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మోర్గన్ ఒకడు. గత రెండేళ్లుగా మోర్గన్ పేలవమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల గాయాలతో కూడా సతమతమవుతున్నాడు. ఇక తన ఫామ్ వల్లే అతను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడని చాలా మంది భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications