Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

26 సంవత్సరాలుగా ఇంగ్లాండ్ ఓడిపోతూనే ఉంది

England achieves huge list of unwanted records following defeat in Perth

హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టుకు ఘోరమైన గడ్డుకాలం నడుస్తున్నట్లుంది. ఒకే వేదికపై అత్యధిక సార్లు ఓటమి పాలైంది. అది 26 సంవత్సరాలుగా ఓడిపోతూనే ఉంది. 1991 నుంచి 2017 వరకు పెర్త్‌ వేదికగా జరిగిన ప్రతి మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ ఓడిపోతూనే ఉంది.

ఈ ఇరవై ఆరు సంవత్సరాల్లో ఆ వేదికపై ఇంగ్లాండ్ ఓడిపోవడం ఎనిమిదో సారి. ఇంత చెత్త రికార్డును మూట గట్టుకున్న ఇంగ్లాండ్‌కు ఓ తోడు దొరికింది. అదే జింబాబ్వే. తను ఏం తీసిపోలేదు. గతంలో జింబాబ్వే క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో వరుసగా ఎనిమిది సార్లు ఓడిపోయింది.

ఇక ఆటగాళ్ల విషయానికొస్తే..
* ఆస్ట్రేలియా దేశంలో ఆడిన అలెస్టైర్ కుక్ 14 మ్యాచ్‌ల్లో తన టీం ఓడిపోయింది. అంతేకాదు అతనితో పాటు సచిన్ టెండూల్కర్, సర్ జాక్ హబ్స్ కూడా విఫలమైన 14 మ్యాచ్‌ల జాబితాలో ఉన్నారు. అంతేగాక, బ్రెయిన్ లారా 13 టెస్ట్‌లు, జేమ్స్ అండర్‌సన్ 12 టెస్ట్‌ల విఫల రికార్డులు కల్గి ఉన్నారు.

* 1993-94 సంవత్సర కాలం నుంచి ఆడిన ఏడు టెస్ట్‌ల పరాజయాన్ని నెత్తిన పెట్టుకుంది. ఇందులో ఆరు మ్యాచ్‌ల టాస్ ఇంగ్లాండ్ గెలుచుకోవడం గమనార్హం.

* అలెస్టర్ కుక్ ఈ సిరీస్ మొత్తానికి చేసిన స్కోరు 83 పరుగులు కాగా ఇదే అతని కెరీర్ లో తక్కువ స్కోరు. ఇంతకు ముందు దక్షిణాఫ్రికాతో తలపడిన టెస్ట్‌లో కుక్ 103పరుగులు చేశాడు.

ఒక టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగువందలకు పైగా పరుగులు చేసి ఇన‍్నింగ్స్‌ తేడాతో ఓటమి పాలైన చెత్త రికార్డును కూడా ఇంగ్లండ్‌ అత్యధిక సార్లు నమోదు చేసింది. ఇలా ఇంగ్లండ్‌ ఓటమి పాలు కావడం నాల్గోసారి కాగా, శ్రీలంక ఒకసారి, పాకిస్థాన్‌ ఒకసారి నమోదయ్యాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 18, 2017, 17:47 [IST]
Other articles published on Dec 18, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+