ఇంగ్లండ్‌లో ఇంగ్లండే: ఆతిథ్య జట్టు హ్యాట్రిక్!

లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్ గెలిచే అవకాశం ఆతిథ్య జట్టుకే ఉందా? ఉందని నిరూపించింది ఇంగ్లండ్. గత రెండు ప్రపంచకప్ టోర్నమెంట్‌లను ఆతిథ్య జట్లు గెలుచుకున్నట్లే..మూడో ప్రపంచకప్‌ను ఆతిథ్య జట్టే కైవసం చేసుకుంది. 2011, 2015 ప్రపంచకప్ టోర్నమెంట్‌లను నిర్వహించిన దేశాలే ప్రపంచకప్‌ను ఎత్తుకున్నాయి. 2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహించాయి. ఈ రెండు సార్లు కూడా ఆతిథ్య జట్లే గెలుపొందాయి. ఈ సంప్రదాయాన్ని కొనసాగించింది ఇంగ్లండ్. ఆతిథ్య జట్టు హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడో ప్రపంచకప్ కూడా నిర్వాహక జట్టే గెలుపొందింది.

ఈడెన్‌లో భారత్ జయకేతనం..
2011, ఏప్రిల్ 2వ తేదీన కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో.. భారత క్రికెట్ జట్టు శ్రీలంకను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు మొత్తం 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు అలవోకగా విజయాన్ని అందుకుంది. 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి విజేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్‌లో అప్పటి కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అవార్డును అందుకున్నారు.

మెల్‌బోర్న్.. ఆసీస్ కైవసం..
2015 మార్చి 29వ తేదీన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 45 ఓవర్లలో 183 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 33.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 186 పరుగులు చేసింది. ఈ రెండు టోర్నమెంట్లకు మరో సారూప్యత కూడా ఉంది. తోటి నిర్వాహక జట్టే రన్నరప్‌గా నిలవడం విశేషం. 2011లో శ్రీలంక, 2015లో న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలిచాయి.

లార్డ్స్ లో లార్డ్‌గా..
ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే- ఈ సారి ప్రపంచకప్ విజేతగా ఆతిథ్య జట్టు ఆవిర్భవించే అవకాశాలను నిజం చేసింది ఇంగ్లీష్ టీమ్. ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తోన్న ఇంగ్లండ్ జట్టు జోరు మీదున్న ఇంగ్లండ్.. ఫైనల్ మ్యాచ్‌లో బ్లాక్ క్యాప్స్‌పై విజయం సాధించింది. సూపర్ ఓవర్ దాకా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. 44 సంవత్సరాల కలను సాకారం చేసుకుంది. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా మూడుసార్లు ఫైనల్‌లో ప్రవేశించినప్పటికీ..కప్‌ను అందుకోలేకపోయింది. ఈ సారి ఆ సంప్రదాయానికి బ్రేక్ వేసింది. నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు.. విశ్వవిజేతగా ఆవిర్భవించింది.
{headtohead_cricket_2_4}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications