For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs WI: ఆదుకున్న బట్లర్.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం!!

Ali stars England cruise to 6-wicket win

దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌‌ 2021లో ఇంగ్లండ్ ఘనమైన బోణీ కొట్టింది. టోర్నీలో ఆడిన తొలి మ్యాచులోనే పటిష్ట వెస్టిండీస్‌పై ఘన విజయం అందుకుంది. విండీస్ నిర్దేశించిన 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 8.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వరుస వికెట్లు పడుతున్నా.. ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ జట్టును ఆదుకున్నాడు. 22 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. జానీ బెయిర్​స్టో (9), లియామ్ లివింగ్​స్టోన్ (1), మొయిన్ అలీ (3)లు విఫలమయ్యారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన మొయిన్ అలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

స్వల్ప లక్ష్య ఛేదనలోనూ ఇంగ్లండ్ తడబాటుకు గురైంది. ఛేదనలో 8.2 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 56 పరుగులు చేసి విజయం సాధించింది. జేసన్ రాయ్‌ (11), జానీ బెయిర్‌స్టో (9), మొయిన్‌ అలీ (3), లియామ్ లివింగ్ స్టోన్ (1) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయితే జోస్ బట్లర్‌ (24 నాటౌట్) జట్టును ఆదుకున్నాడు. ఇక కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (7) నాటౌట్‌గా నిలిచాడు. విండీస్‌ బౌలర్లలో హోసైన్ 2, రవి రాంపాల్ ఒక వికెట్ తీశారు. లక్ష్యం చిన్నదైనా వెస్టిండీస్ బౌలర్లు ఏ మాత్రం వెనుకాడలేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. బ్యాటింగ్‌లో మరికాస్త పరుగులు రాబట్టి ఉంటే విండీస్‌ గెలిచేందుకు అవకాశాలు ఉండేవి.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 55 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. క్రిస్‌ గేల్‌ (13) ఒక్కడే రెండంకెల స్కోరును సాధించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్‌ అదిల్ రషీద్‌ (4/2) 2.2 ఓవర్లలో కేవలం రెండు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్‌ పతనంలో కీలకపాత్ర పోషించాడు. విండీస్ బ్యాటర్లలో లెండిల్ సిమన్స్ 3, ఎవిన్ లూయిస్ 6, శిమ్రాన్ హెట్‌మెయిర్‌ 9, డ్వేన్ బ్రావో 5, నికోలస్ పూరన్ 1, కీరన్‌ పొలార్డ్‌ 6, ఆండ్రీ రస్సెల్‌ 0, హోసెన్ 6, మెక్‌కీ డకౌట్‌, రవి రాంపాల్‌ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మిల్స్‌ 2, మొయిన్ అలీ 2.. వోక్స్, జొర్డాన్ చెరో వికెట్ తీశారు.

విండీస్ జట్టులో అంతా హార్డ్‌ హిట్టర్లు.. టీ20 స్పెషలిస్టు బ్యాటర్లు ఉన్నారు. అంతేకాదు రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను అందుకున్న జట్టు. అలాంటిది విండీస్‌ తొలి మ్యాచ్‌ అంటే ఎన్ని అంచనాలు ఉంటాయి మరి. అయితే వెస్టిండీస్‌ బ్యాటర్లు మాత్రం ఒక్కరంటే ఒక్కరూ కీలక ఇన్నింగ్స్‌ను ఆడలేదు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. సీనియర్‌ బ్యాటర్లు క్రిస్‌ గేల్, కెప్టెన్‌ పొలార్డ్‌, ఆండ్రీ రస్సెల్‌ అయినా అలరిస్తారేమో అనుకుంటే అదీ జరగలేదు. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో విండీస్‌ ఆటగాళ్లు నిలబడలేకపోయారు.

Story first published: Saturday, October 23, 2021, 22:34 [IST]
Other articles published on Oct 23, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+