
షార్జా: టీ20 ప్రపంచకప్ 2021లో ఇప్పటి వరకు హాఫ్ సెంచరీలు నమోదు అయ్యాయి కానీ.. సెంచరీ మాత్రం నమోదు కాలేదు. సోమవారం షార్జా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లీష్ ఓపెనర్ జాస్ బట్లర్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2021లో బట్లర్ తొలి సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పార్ట్‌నర్‌షిప్‌తో బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. 67 బంతుల్లో 101 పరుగులు చేసిన బట్లర్ స్ట్రయిక్ రేట్ 150.74 గా ఉంది. ఇప్పటివరకు ఒమన్, యూఏఈ వేదికగా జరుగుతున్న మెగా టోర్నీలో ఒక్క సెంచరీ కూడా నమోదు కాని విషయం తెలిసిందే.
షార్జా పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైనప్పటికీ ఇంగ్లిష్ వికెట్‌కీపర్ జాస్ బట్లర్ తన క్లాస్‌ని ప్రదర్శించి ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో బట్లర్ మొదటి సెంచరీ చేసి హీరో అయ్యాడు.మొదట నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించిన బట్లర్.. ఆ తర్వాత పిచ్‌ని అర్థం చేసుకొని పరుగులు రాబట్టాడు. ఒకవైపు నుంచి వికెట్లు పడుతున్నా.. బట్లర్ తన ఆటను ఎక్కడా తగ్గకుండా కొనసాగించాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఒక సిక్స్, నాలుగు ఫోర్ల సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత శ్రీలంక బౌలర్లపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. అనంతరం 22 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
అర్ధ సెంచరీ అనంతరం జాస్ బట్లర్ సిక్సర్లతో మరింత రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ కొట్టి బట్లర్.. సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. మోర్గాన్‌తో కలిసి బట్లర్ 78 బంతుల్లో 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బట్లర్ 4 మ్యాచ్‌ల్లో 214 సగటుతో 214 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉంది. కేవలం 4 మ్యాచ్‌ల్లోనే బట్లర్ 12 సిక్సర్లు, 15 ఫోర్లు బాదాడు. బట్లర్ ఫామ్ ఇంగ్లండ్‌కు చాలా మంచి వార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఆటగాడి బ్యాటింగ్ ఇలాగే కొనసాగితే ఇంగ్లీష్ జట్టు రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో భాగంగా సోమవారం రాత్రి షార్జాలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 రన్స్ చేసి.. శ్రీలంక ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ ఓపెనర్ జొస్ బట్లర్ సూపర్ సెంచరీ చేశాడు. 67 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సుల సాయంతో 101 పరుగులు చేశాడు. బట్లర్ ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్స్ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. టీ20ల్లో బట్లర్‌కు ఇదే అత్యధిక స్కోర్. జాసన్ రాయ్, డేవిడ్ మలన్, జానీ బైయిరిస్టో విఫలమయినా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (40) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగా మూడు వికెట్లు పడగొట్టాడు. దుష్మంత చమీర ఒక వికెట్ తీశాడు.