Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs SL: జొస్ బట్లర్ సూపర్ సెంచరీ.. శ్రీలంక ముందు భారీ టార్గెట్!!

ENG vs SL: Jos Buttler century powers England to 163, Sri Lanka target is 163

షార్జా: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2021 సూప‌ర్ 12లో భాగంగా సోమవారం రాత్రి షార్జాలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 రన్స్ చేసి.. శ్రీలంక ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ ఓపెనర్ జొస్ బట్లర్ సూపర్ సెంచరీ చేశాడు. 67 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సుల సాయంతో 101 పరుగులు చేశాడు. బట్లర్ ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్స్ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. టీ20ల్లో బట్లర్‌కు ఇదే అత్యధిక స్కోర్. జాసన్ రాయ్, డేవిడ్ మలన్, జానీ బైయిరిస్టో విఫలమయినా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (40) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగా మూడు వికెట్లు పడగొట్టాడు. దుష్మంత చమీర ఒక వికెట్ తీశాడు.

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే భారికి షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ 9 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆపై డేవిడ్ మలన్, జానీ బైయిరిస్టో కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో జొస్ బ‌ట్ల‌ర్, ఇయాన్ మోర్గాన్ ఇద్ద‌రూ చెల‌రేగిపోయి ఆడారు. దీంతో ఒక్క‌సారిగా ఇంగ్లండ్ స్కోర్ పెరిగింది. ఇంగ్లండ్ స్కోర్ అసలు 150 దాటేదే కాదు. అయితే 67 బంతుల్లో 101 ప‌రుగులు చేసిన బ‌ట్ల‌ర్.. 6 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు. కెప్టెన్ మోర్గాన్ కూడా 36 బంతుల్లో 40 ప‌రుగులు చేసి ఇంగ్లండ్‌కు భారీ స్కోర్ అందించాడు. శ్రీలంక బౌల‌ర్ల‌లో హ‌స‌రంగా.. 4 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు తీసి కేవ‌లం 21 ప‌రుగులు మాత్ర‌మే అందించాడు. చ‌మీరా 4 ఓవ‌ర్లు వేసి 43 ప‌రుగులు అందించి ఒక్క వికెట్ తీశాడు.

ఈ మ్యాచ్ శ్రీలంక‌కు డూ ఆర్ డై అనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో గెల‌వ‌క‌పోతే.. సెమీస్ ఆశ‌లను శ్రీలంక వ‌దిలేసుకోవాల్సిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్‌ల‌లో కేవ‌లం ఒకే మ్యాచ్ గెలిచిన శ్రీలంక.. గ్రూప్ 1లో 4వ స్థానంతో స‌రిపెట్టుకుంది. శ్రీలంక జట్టుకు కేవ‌లం 2 పాయింట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. అలాగే నెట్ ర‌న్ రేట్ కూడా నెగెటివ్‌లో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి.. ఇంకో మ్యాచ్ వెస్టిండీస్‌పై కూడా గెలిచి ఎక్కువ నెట్ ర‌న్ రేట్ సాధిస్తే.. శ్రీలంక‌కు సెమీస్ అవ‌కాశాలు ఉండే చాన్స్ ఉంది.

Story first published: Monday, November 1, 2021, 22:54 [IST]
Other articles published on Nov 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+