For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌండ‌రీ లైన్‌ వ‌ద్ద జేమ్స్ నీషమ్‌ ఔటై ఉంటే.. ఫలితం మరోలా ఉండేదేమో! మ్యాచ్ టర్నింగ్ పాయింట్ (వీడియో)!

ENG vs NZ: If James Neesham out with Bairstows catch, Semi Final result would have been different

హైదరాబాద్: అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన టీ20 ప్రపంచకప్ 2021 తొలి సెమీ ఫైన‌ల్లో న్యూజిలాండ్ అనూహ్య రీతిలో గెలుపొందింది. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న స‌మ‌యంలో.. కివీస్ హిట్ట‌ర్ జేమ్స్ నీష‌మ్ భారీ షాట్ల‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. కీల‌క‌మైన ద‌శ‌లో మూడు సిక్స‌ర్లు కొట్టి ఇంగ్లండ్ ఆశ‌లుపై నీళ్లు చ‌ల్లాడు. దాంతో ర‌వ‌త్త‌రంగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గి ఫైన‌ల్లోకి ప్ర‌వేశించింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన కివీస్ మరో ఆరు బంతులు మిగిలుండగానే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది.

ఆదుకున్న మిచెల్‌, కాన్వె

ఆదుకున్న మిచెల్‌, కాన్వె

న్యూజిలాండ్‌ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కోల్పోయింది. 13 పరుగులకే కివీస్‌ రెండు కీలక వికెట్లు (మార్టిన్‌ గప్టిల్‌, కేన్‌ విలియమ్సన్‌) కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. అయితే డారెల్‌ మిచెల్‌ (48 బంతుల్లో 73 నాటౌట్‌, 4ఫోర్లు, 4సిక్స్‌లు), దేవాన్ కాన్వె (46) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

వీరిద్దరు కలిసి ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డుకు కీలక పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న తరుణంలో లియామ్ లివింగ్‌స్టోన్‌ ఊరించే బంతికి కాన్వె ఔట్ అవ్వడంతో మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న జోష్ ఫిలిప్స్‌ (2) అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. ఇక మిచెల్‌కు తోడుగా జేమ్స్ నీషమ్‌ క్రీజులోకి వచ్చాడు.

బెయిర్‌స్టో పట్టినా

బెయిర్‌స్టో పట్టినా

చివరి నాలుగు ఓవర్లలో న్యూజిలాండ్‌ విజయానికి 57 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటికీ ఇంగ్లండ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రిస్‌ జోర్డాన్ వేసిన 17వ ఓవర్లో జేమ్స్ నీషమ్‌ చెలరేగిపోయాడు. 17వ ఓవర్ తొలి బంతికి సిక్స్ బాదిన నీషమ్‌.. మూడో బంతిని ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతికే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద ఉన్న జానీ బెయిర్‌స్టోకి చిక్కాడు.

అయితే బంతిని చేతుల్లోకి తీసుకున్న జానీ.. బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ లైన్‌ను తాకడంతో అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆ ఓవర్లో నీషమ్‌ రెండు సిక్సులు, ఓ ఫోర్‌ సహా మొత్తం 23 పరుగులు రాబట్టాడు. దీంతో కివీస్ జట్టులో ఆశలు చిగురించాయి.

నీషమ్‌ మెరుపులతో

జేమ్స్ నీషమ్‌ మెరుపులతో కివీస్ లక్ష్యం కాస్తా 18 బంతుల్లో 34కు చేరుకుంది. అదే జోరులో ఆదిల్ రషీద్‌ బౌలింగ్‌లో 14 పరుగులు రావడంతో సమీకరణం 12 బంతులకు 20కి మారింది. ఆ ఓవర్ చివరి బంతికి నీషమ్‌ ఔట్ అయ్యాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక క్రిస్ వోక్స్‌ వేసిన 19వ ఓవర్‌లో డెరిల్‌ మిచెల్‌ రెండు సిక్స్‌లు, ఫోర్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. క్రిస్‌ జోర్డాన్ వేసిన 17వ ఓవర్లో నీషమ్‌ ఔటై ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ కీలక ఓవర్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ తన అధికారిక ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంది. ఇక ఆలస్యం ఎందుకు మీరూ చూసేయండి.

Story first published: Thursday, November 11, 2021, 13:18 [IST]
Other articles published on Nov 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+