Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Eng Vs Nz 3rd Test: ఇదెక్కడి మాస్ గేమ్ రా నాయనా.. జానీ డేర్ షో.. సిరీస్ వైట్ వాష్ చేసిన ఇంగ్లాండ్

Eng Vs Nz 3rd Test : Jonny Bairstow Attacking Game Helps to Whitewash series

లీడ్స్‌లోని హెడింగ్లే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌‌లో ఇంగ్లాండ్ అద్వితీయ విజయం సాధించి.. మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 3-0తో వైట్ వాష్ చేసింది. వర్షం కారణంగా అయిదో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక 183/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో అయిదో రోజు ఆట మొదలెట్టిన ఇంగ్లాండ్‌ బ్యాటర్ ఆలీ పోప్ (82పరుగులు 108బంతుల్లో 12ఫోర్లు) తొందరగానే ఔటయ్యాడు. ఇక క్రీజులో కడవరకు నిలబడిన జోరూట్ (86 పరుగులు 125బంతుల్లో 11ఫోర్లు, 1సిక్సర్లు నాటౌట్) వికెట్ కాపాడుతూ రాణించగా.. జానీ బెయిర్ స్టో (71 పరుగులు 44బంతుల్లో 9ఫోర్లు 3సిక్సర్లు నాటౌట్) ఎప్పటిలాగే తన టీ20 ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఇంగ్లాండ్ 7వికెట్ల తేడాతో విజయం సాధించి.. న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఇక కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ తన తొలి సిరీస్లోనే డిఫెండింగ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ అయిన న్యూజిలాండ్‌ను ఓడించి విజయం సాధించడం గమనార్హం.

 ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడినా..

ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడినా..

ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ సెంచరీల వీరుడు డారిల్ మిచెల్ (109పరుగులు) సెంచరీతో రాణించడంతో 329పరుగులు చేయగలిగింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 55పరుగులకే 6వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినప్పటికీ.. ఫాంలో ఉన్న జానీ బెయిర్ స్టో (162పరుగులు) సెంచరీ ఇన్నింగ్స్‌కు తోడు.. ఇంగ్లాండ్ అరంగేట్ర బౌలర్ జేమీ ఓవర్టన్ (97పరుగులు)తో అనూహ్యంగా రాణించడంతో ఇంగ్లాండ్ 360పరుగులు చేసి 31పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

జాక్ లీచ్ బౌలింగ్లో అదరగొట్టాడు

జాక్ లీచ్ బౌలింగ్లో అదరగొట్టాడు

ఇక రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లలో లాథమ్ (76), కేన్ విలియమ్సన్ (48), డారిల్ మిచెల్ (56), టామ్ బ్లండెల్ (88) రాణించడంతో 326పరుగులు చేసి 296పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్‌ లీచ్‌ 5, మ్యాటీ పాట్స్‌ 3, జేమీ ఓవర్టన్‌, జో రూట్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లోనూ 5వికెట్ల హాల్ సాధించి న్యూజిలాండ్ పతనాన్ని సాధించిన లీచ్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 5వికెట్లు తీసి ఓవరాల్‌గా 10వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను కోలుకోనివ్వలేదు.

 రెండో ఇన్నింగ్స్‌లో జానీ డేర్ షో

రెండో ఇన్నింగ్స్‌లో జానీ డేర్ షో

ఇకపోతే ఎప్పటిలాగే ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఎటాకింగ్ వ్యూహాన్ని ఎంచుకుంది. 296పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు అలెక్స్ లీ (9), జాక్ క్రాలీ (25) నిరాశపరిచినా.. ఆలీ పోప్, జోరూట్ క్రీజులో పాతుకుపోయి ఆడారు. దీంతో 39ఓవర్లకు 2వికెట్లు కోల్పోయి నాలుగో రోజు ఆటముగిసే టైంకి ఇంగ్లాండ్ 183పరుగులు చేసింది. ఇంకా 113పరుగులు చేస్తే ఇంగ్లాండ్ గెలుస్తుందనే దశలో చివరి రోజు బరిలోకి దిగాల్సిన ఇంగ్లాండ్‌కు వాన దేవుడు కాసేపు పరీక్ష పెట్టాడు. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆట ప్రారంభమైంది. ఇక ఆలీ పోప్ ఔటయినా.. జో రూట్, జానీ బెయిర్ స్టో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. చివరికి సిక్స్ కొట్టి బెయిర్ స్టో విజయలాంఛనాన్ని ముగించాడు. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ వైట్ వాష్ చేసింది.

Story first published: Monday, June 27, 2022, 20:45 [IST]
Other articles published on Jun 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+