Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Eng Vs Nz 3rd Test: జాక్ లీచ్ 10వికెట్ల దెబ్బకు న్యూజిలాండ్‌కు గుండు సున్నే.. చివరి టెస్ట్‌ ఇంగ్లాండ్‌దే..!

root

లీడ్స్‌లోని హెడింగ్లే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌‌లో ఇంగ్లాండ్ గెలుపు అంచులకు చేరుకుంది. ఈ సిరీస్లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలోకి వచ్చిన ఇంగ్లాండ్.. 3వ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ వైట్ వాష్ చేయడానికి సిద్ధమైంది. ఇక 168/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆట మొదలెట్టిన న్యూజిలాండ్‌‌ను ఎప్పటిలాగే డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్‌లు ఆదుకున్నారు. డారిల్‌ మిచెల్‌ (56 పరుగులు 152బంతుల్లో 9ఫోర్లు), టామ్‌ బ్లండెల్‌ (88పరుగులు 161బంతుల్లో 15ఫోర్లు నాటౌట్‌) క్రీజులో పాతుకుపోయారు.
వీరిద్దరు ఔటైతే గానీ తాము గెలవడం అసాధ్యమని భావించిన ఇంగ్లాండ్.. మార్చి మార్చి బౌలింగ్ వేయించింది. ఇక 6వికెట్‌కు 113పరుగులు జోడించిన ఈ జోడీని మ్యాటీ పాట్స్ విడగొట్టాడు.

ఇక తర్వాత వచ్చిన టెయిలెండర్లు బ్లండెల్‌కు అంతగా సపోర్ట్ ఇవ్వలేకపోయారు. బ్రేస్ వెల్ (9), సౌతీ (2), వాగ్నర్ (0), ట్రెంట్ బౌల్ట్ (4) ఎవరు కాసేపు కూడా నిలదొక్కుకుపోవడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 326పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు 296 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ విధించగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్‌ లీచ్‌ 5, మ్యాటీ పాట్స్‌ 3, జేమీ ఓవర్టన్‌, జో రూట్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లోనూ 5వికెట్ల హాల్ సాధించి న్యూజిలాండ్ పతనాన్ని సాధించిన లీచ్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 5వికెట్లు తీసి ఓవరాల్‌గా 10వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను గట్టి దెబ్బ కొట్టాడు.

ఇకపోతే ఎప్పటిలాగే ఇంగ్లాండ్ తన దూకుడైన ఆటతో లక్ష్యాన్ని ఛేదించేందుకు ఎటాకింగ్ వ్యూహాన్ని ఎంచుకుంది. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆలీ పోప్ (81పరుగులు 105బంతుల్లో 12ఫోర్లు నాటౌట్), జోరూట్ (55పరుగులు 80బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సర్ నాటౌట్) క్రీజులో పాతుకుపోయి ఆడడంతో ఇంగ్లాండ్ 39ఓవర్లకు 2వికెట్లు కోల్పోయి 183పరుగులు చేసింది. ఇంకా 113పరుగులు చేస్తే ఇంగ్లాండ్ గెలుస్తుంది. మరో రోజు ఆట మిగిలి ఉండడంతో ఇంగ్లాండ్ విజయం నల్లేరు మీద నడకే.

Story first published: Sunday, June 26, 2022, 23:29 [IST]
Other articles published on Jun 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+