Eng vs Nz 2nd test Final Day: ఆట మాంచి పొంగు మీదుంది.. ఇంగ్లాండ్ గెలుపుకు 74ఓవర్లలో 299 రన్స్ కావాలి

నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. గత నాలుగు రోజులుగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ హోరాహోరీగా ఆడుతున్నాయి. తొలుత కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 553పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా.. ఇంగ్లాండ్ 539పరుగులు చేసింది.
దీంతో న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. ఇక నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి.. 7వికెట్లు కోల్పోయి 224పరుగులు చేసింది. తద్వారా 238పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక చివరిదైనా అయిదో రోజు ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ 284పరుగులకు ఆలౌట్ అయింది.

మళ్లీ డారిల్ మిచెల్ కడవరకు పోరాటం
న్యూజిలాండ్ బ్యాటర్లలో డేవన్ కాన్వే (52), విల్ యంగ్ (56) పరుగులతో రాణించగా.. కడవరకు క్రీజులో ఉన్న డారిల్ మిచెల్ (62పరుగులు 131బంతుల్లో నాటౌట్ 4ఫోర్లు, 1సిక్సర్) పట్టుదలగా పోరాట పటిమ కనబరిచాడు. ఇక మిగతా బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయకపోవడంతో 284పరుగులకే న్యూజిలాండ్ చాప చుట్టేసింది. ఇకపోతే ఇంగ్లాండ్ మీద 298పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక ఇంగ్లాండ్ గెలవాలంటే చివరి రోజు మిగిలిన 74.3ఓవర్లలో 299పరుగులు చేయాల్సి ఉంటుంది.

ఇరు జట్లకు గెలిచే అవకాశం
ఒకవేళ న్యూజిలాండ్ గెలవాలంటే 10వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఇక ఆదిలోనే న్యూజిలాండ్ వికెట్లు తీస్తే ఇంగ్లాండ్ డిఫెండ్ చేసుకుంటూ ఆడి డ్రాగా ముగించొచ్చు. ఒకవేళ వికెట్లు పడకపోతే చివర్లో ఇంగ్లాండ్ ప్లేయర్లు హిట్టింగ్ చేసి గెలవడానికి ప్రయత్నించొచ్చు. ఏదేమైనా చివరి వరకు ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 2, స్టువర్ట్ బ్రాడ్ 3, మ్యాటీ పాట్స్ 2, జాక్ లీచ్ 1 వికెట్ తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు.

స్కోరు సమ్మరీ
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ - 553
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ - 539,
న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ - 284
ఇంగ్లాండ్ విజయానికి కావాల్సినది - 74.3ఓవర్లలో 299పరుగులు
న్యూజిలాండ్ విజయానికి కావాల్సింది - 10 వికెట్లు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications