Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG Vs NZ 1st Test: న్యూజిలాండ్ ఓటమికి 4 ప్రధాన కారణాలు ఇవే..!

Top 4 Main reasons for New Zealand defeat in the first Test against England

లార్డ్స్‌‌లో ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జోరూట్ (115పరుగులు 170బంతుల్లో, 12ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో మరో రోజు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మీద 5వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగో రోజు 216/5 స్కోరుతో బరిలోకి జో రూట్ కడవరకు క్రీజులో ఉండి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ బెన్ ఫోక్స్ ( 32పరుగులు 92బంతుల్లో 3ఫోర్లు) కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక టెస్ట్ ఛాంపియన్ షిప్ (2021 - 23)లో 14మ్యాచ్‌లలో రెండు మ్యాచ్‌లు గెలిచి 30పాయింట్లతో 8వ స్థానానికి చేరుకుంది. అంతకుముందు అట్టడుగున 9వ స్థానంలో ఉండగా.. తాజా విజయంతో ఇంగ్లాండ్ ఒక స్థానాన్ని ఎగబాకింది. బంగ్లాదేశ్ 16పాయింట్లతో అట్టడుగుకు పడిపోయింది. ఇక సిరీస్‌లో (1-0)తేడాతో ఇంగ్లాండ్ ఆధిక్యంలో వచ్చింది. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఆధ్వర్యంలో గెలుపుతో ఇంగ్లాండ్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇక తొలి టెస్టులో గెలిచే అవకాశమున్నా.. న్యూజిలాండ్ ఓటమి పాలయింది. న్యూజిలాండ్ ఓటమికి 4 ప్రధాన కారణాలివే.

తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 132పరుగులకే ఆలౌట్

ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్లు అయిన ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, కొత్త కుర్రాడు మాథ్యు పాట్స్ బౌలింగ్‌ను సరిగ్గా అంచనా వేయలేని న్యూజిలాండ్ ప్లేయర్లు.. తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా ఆడారు. కలిన్ డి గ్రాండ్ హోమ్ (42పరుగులు 50బంతుల్లో) మినహా బ్యాటర్లెవరూ పోరాడలేదు. ఆ జట్టు రెండో అత్యుత్తమ స్కోరు సౌథీ (26)ది మాత్రమే. ఇక బ్యాటర్లెవరూ కూడా 20పరుగులు దాటలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నిర్ణయం కూడా సరైంది కాదని తేలింది. కాస్త పోరాడి స్కోరు 200దాటించిన పరిస్థితి ఇంకాస్త బెటర్‌గా ఉండేది. ఎందుకంటే ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 141పరుగులకే ఆలౌట్ కావడంతో కమాండింగ్ పొజిషన్లో న్యూజిలాండ్ ఉండేది.

న్యూజిలాండ్ పతనాన్ని శాసించిన ఆ ముగ్గురు

ఇకపోతే న్యూజిలాండ్ బ్యాటర్ల పతనాన్ని ఇంగ్లాండ్ బౌలర్లు ఆండర్సన్, మాథ్యు పాట్స్, స్టువర్ట్ బ్రాడ్ శాసించారు. ఇక జేమ్స్ అండర్సన్ తన మునుపటి స్పెల్‌తో ఈ మ్యాచ్‌లో 6వికెట్లు తీయగా, స్టువర్ట్ బ్రాడ్ 4వికెట్లు తీసి తమ అనుభవాన్ని జట్టుకు ప్లస్ పాయింట్లుగా మార్చారు. ఇక ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన కుర్రాడు మ్యాటీ పాట్స్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 7వికెట్లు తీశాడు. ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడంతో డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ మినహా మిగతా ప్లేయర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.

251పరుగుల వద్ద హ్యాట్రిక్ ఔట్లు

తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ విఫలమైన రెండో ఇన్నింగ్స్‌లో డరైల్‌ మిచెల్‌ (203బంతుల్లో 108పరుగులు 12 ఫోర్లు) సెంచరీతో రాణించాడు. అలాగే టామ్‌ బ్లండెల్‌ (198 బంతుల్లో 96పరుగులు, 12 ఫోర్లు) కూడా అద్భుతంగా ఆడాడు. వీరిద్దరి జోడీ 5వ వికెట్‌కు 195పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 56కే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ న్యూజిలాండ్.. 250పరుగులకు కేవలం 4వికెట్లు మాత్రమే కోల్పోయి కమాండింగ్ పొజిషన్‌కు చేరుకుంది. కానీ 251పరుగుల వద్ద 83వ ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ 3వ బంతికి డారైల్ మిచెల్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. 4వ బంతికి కాలిన్ డీ గ్రాండ్ హోమ్ నిర్లక్ష్యపూరితంగా రనౌట్ అయ్యాడు. ఇక 5వ బంతికి జేమీసన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 251పరుగుల వద్దే హ్యాట్రిక్ వికెట్లు న్యూజిలాండ్ కోల్పోయింది. ఇక చివరి 35పరుగుల్లో ఆ జట్టు 6వికెట్లు కోల్పోయి 285పరుగులకే చాప చుట్టేసింది.

కొంపముంచిన నోబాల్, తాటతీసిన జోరూట్

277పరుగుల విజయలక్ష్యంతో చివరి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ కైలీ జేమీసన్ (4-59) దెబ్బకు 69పరుగులకే 4వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ తీవ్ర కష్టాల్లో పడింది. ఇక ఇన్నింగ్స్ నిర్మాణ బాధ్యతలను మాజీ సారథి జో రూట్, ప్రస్తుత కెప్టెన్ బెన్ స్టోక్స్ తీసుకున్నారు. అయితే గ్రాండ్ హోమ్ బౌలింగ్లో 1పరుగుకే ఔటయిన స్టోక్స్.. లక్కీగా నోబాల్ ద్వారా బతికిపోయాడు. ఇక వచ్చిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుని హాఫ్ సెంచరీతో పాటు జో రూట్‌తో కలిసి 5వికెట్‌కు 90పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. స్టోక్స్ (54) ఔటయినా.. జోరూట్ (115) మొండిగా క్రీజులో నిలిచి సెంచరీతో పోరాడాడు. బెన్ ఫోక్స్ (32)తో కలిసి 120పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించారు.

Story first published: Sunday, June 5, 2022, 18:15 [IST]
Other articles published on Jun 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+