ENG Vs NZ 1st Test: జోరూటే సెపరేటు.. క్రీజులో క్రేజీగా పాతుకుని సెంచరీతో ఇంగ్లాండ్‌ను గెలిపించాడు

లార్డ్స్‌లో జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో సెంచరీ వీరుడు జోరూట్ (115పరుగులు 170బంతుల్లో, 12ఫోర్లు) అద్భుతంగా ఆడి న్యూజిలాండ్ నుంచి విజయాన్ని లాక్కున్నాడు. మరో రోజు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్.. న్యూజిలాండ్ మీద 5వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయానికి 61పరుగులు కావాల్సిన తరుణంలో నాలుగో రోజు 216/5 స్కోరుతో బరిలోకి జో రూట్.. ఏ దశలోనూ తన పట్టు సడలించలేదు. కడవరకు క్రీజులో ఉండి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ బెన్ ఫోక్స్ ( 32పరుగులు 92బంతుల్లో 3ఫోర్లు) కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు 120పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇంగ్లాండ్ విజయదాహాన్ని తీర్చారు. ఇక టెస్ట్ ఛాంపియన్ షిప్ (2021 - 23)లో ఇప్పటికే 13 మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌కు ఈ విజయంతో 2వ గెలుపుతో కాస్త ఊరట లభించినట్లయింది. ఇక సిరీస్‌లో (1-0)తేడాతో ఇంగ్లాండ్ ఆధిక్యంలో వచ్చింది. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఆధ్వర్యంలో గెలుపుతో ఇంగ్లాండ్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో రాణించిన డరైల్ మిచెల్, టామ్ బ్లండెల్
తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 132పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ సైతం 141పరుగులకే ఆలౌటైంది. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో డరైల్ మిచెల్ (203బంతుల్లో 108పరుగులు 12 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా.. టామ్ బ్లండెల్ (198 బంతుల్లో 96పరుగులు, 12 ఫోర్లు) రాణించడంతో 285పరుగులు చేసింది. ఇకపోతే 277పరుగుల విజయలక్ష్యంతో చివరి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఏమాత్రం శుభారంభం దొరకలేదు. కైలీ జేమీసన్ (4-59) ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి వికెట్‌కు అలెక్స్ లీ (20పరుగులు)ను బోల్డ్ చేసిన జేమీసన్, తర్వాత క్రాలీని స్లిప్ క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో 32పరుగులకే ఓపెనర్లిద్దరు పెవిలియన్ బాట పట్టారు. ఇక తర్వాత ఓలీ పోప్ (10)ను బౌల్ట్ అద్భుతమైన బాల్‌తో బౌల్డ్ చేశాడు. తర్వాత బెయిర్ స్టో (16)ను కూడా కైలీ జేమీసన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవనివ్వలేదు. ఇక 69పరుగులకే 4వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ తీవ్ర కష్టాల్లో పడింది.
ఇన్నింగ్స్ నిర్మాణ బాధ్యతను మోసిన జో రూట్
ఇక ఇన్నింగ్స్ నిర్మాణ బాధ్యతలను మాజీ సారథి జో రూట్, ప్రస్తుత కెప్టెన్ బెన్ స్టోక్స్ తీసుకున్నారు. స్టోక్స్ చూడచక్కని షాట్లతో హాఫ్ సెంచరీతో అలరించాడు. జో రూట్‌తో కలిసి 5వికెట్‌కు 90పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇక ఈ జోడీని జేమీసన్ విడదీశాడు. స్టోక్స్ (54పరుగులు 110బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) ఔటయినా.. జోరూట్ మొండిగా క్రీజులో నిలిచి పోరాడాడు. బెన్ ఫోక్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను విజయం దిశగా నడిపించాడు. ఇక నాలుగో రోజు సెంచరీ పూర్తి చేసుకున్న రూట్.. 118టెస్ట్‌ల్లో 10000పరుగుల మైలురాయి కూడా చేరుకున్నాడు. ఇక కడవరకు క్రీజులో ఉండి చివరగా బౌండరీ బాది ఇంగ్లాండ్‌కు మరపురాని విజయాన్ని అందించాడు.
స్కోర్ సమరీ
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ - 132
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ - 141
న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ - 285
ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ - 279/ 5వికెట్లు
ఇంగ్లాండ్ 5వికెట్ల తేడాతో విజయం, సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తేడాతో లీడ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications