న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జోస్ బట్లర్ దెబ్బకు ధోనీ రికార్డు తుక్కు తుక్కు: ఏబీ డివిలియర్స్ కూడా..

ENG vs NED 2022: Jos Buttler broke MS Dhoni’s record in the ODI series

లండన్: ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్, కేప్టెన్ జోస్ బట్లర్ కేరీర్ పీక్స్‌లో కొనసాగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న రాజస్థాన్ రాయల్స్ జట్టును ఫైనల్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఈ వికెట్ కీపర్.. ఆ దూకుడును తగ్గనివట్లేదు. అదే జోరును ప్రదర్శిస్తోన్నాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌ను కూడా టీ20 ఫార్మట్‌లోనే ఆడేస్తున్నాడు. ఫలితంగా పాత రికార్డులు బద్దలవుతున్నాయి.

నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టు 3-0తో ఈ సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటింది. ఇవాన్ మోర్గాన్‌ను మినహాయిస్తే- ఈ సిరీస్ మొత్తానికీ ఇంగ్లాండ్ ప్లేయర్లు రాణించారు. ఈ మూడు మ్యాచ్‌లల్లో నాలుగు సెంచరీలు బాదారు ఇంగ్లాండ్ బ్యాటర్లు. తొలి వన్డేలో ఫిల్ సాల్ట్, డేవిడ్ మలన్, జోస్ బట్లర్ సెంచరీలు చేశారు.

ప్రత్యేకించి- జోస్ బట్లర్‌కు ఈ వన్డే సిరీస్ ఓ ప్రాక్టీస్‌లాగా కనిపించింది. తొలి వన్డేలో 162 పరుగులు, మూడో వన్డేలో 86 పరుగులు చేశాడు. రెండో వన్డేలో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మూడో వన్డేలో బట్లర్ 64 బంతుల్లో అయిదు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. ఒక సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు అది.

2005లో శ్రీలంకపై ధోనీ.. అత్యధిక సిక్సర్లు కొట్టాడు. ఆ సిరీస్‌ మొత్తానికీ 17 సిక్సర్లు సాధించాడు. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. 2015లో వెస్టిండీస్‌పై సిరీస్‌లో 16 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటివరకు ఆ రికార్డులేవీ చెక్కు చెదరలేదు. ఇప్పుడవి తుక్కుతుక్కు అయ్యాయి. నెదర్లాండ్స్‌పై సిరీస్‌లో జోస్ బట్లర్ 19 సిక్సర్లను కొట్టాడు. దీనితో బట్లర్ టాప్ పొజీషన్‌కు చేరుకున్నాడు. ధోనీ రెండో స్థానానికి, ఏబీ డివిలియర్స్ మూడో ప్లేస్‌కు పడిపోయారు.

Story first published: Friday, June 24, 2022, 14:18 [IST]
Other articles published on Jun 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X