For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ బంతిని ఆడలేక బట్లర్ ఫ్యూజులెగిరిపోయాయ్ - డకౌట్..!!

 ENG vs IRE: Jos Buttler gone for a duck against Ireland in T20 World C

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్-12లో భాగంగా ఇంగ్లాండ్-ఐర్లాండ్ మధ్య రసవత్తరంగా మ్యాచ్ కొనసాగుతోంది. మెల్‌బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ పోటాపోటీగా సాగుతోంది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది ఇంగ్లాండ్. దీనికి అనుగుణంగా సత్తా చాటుతోంది. వామప్ మ్యాచ్‌లల్లో చూపిన దూకుడును ఇక్కడా ప్రదర్శిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన ఆ జట్టు గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది.

ఇవ్వాళ మెల్‌బోర్న్‌లో ఐర్లాండ్‌తో ఆడుతోంది. కష్టాల్లో పడింది. లక్ష్య ఛేదనలో తడబడుతోంది. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి నిలవలేకపోతోంది. 33 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. ఇందులో కేప్టెన్ జోస్ బట్లర్ డకౌట్ కూడా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 14 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్ దారి పట్టారు. వన్ డౌన్ బ్యాటర్ బెన్ స్టోక్స్ కూడా క్రీజ్‌లో నిలవలేకపోయాడు. తక్కువ పరుగులకే వెనుదిరిగాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లల్లో 157 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ఆండీ బల్బిర్నె కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. అర్ధసెంచరీతో అదరగొట్టాడు. 47 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేవాడు. వన్ డౌన్ బ్యాటర్ లొర్కాన్ టక్కర్ 34 పరుగులతో రాణించాడు. మరో ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 14, కర్టిస్ క్యాంఫర్- 18, గెరాత్ డెలానీ-12, మార్క్ అడైర్-4, బెర్రీ మెక్‌క్యార్థీ- 3, ఫియోన్ హ్యాండ్-1 పరుగులు చేశారు. హ్యారీ టెక్టార్, జార్జ్ డాక్రెల్ డకౌట్ అయ్యారు.

ఇంగ్లాండ్ బౌలర్లల్లో మార్క్ వుడ్, లియాం లివింగ్‌స్టొన్ మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. సామ్ కర్రన్-2, బెన్ స్టోక్స్ ఒక వికెట్ తీసుకున్నారు. 158 పరుగుల లక్ష్య ఛేదన కోసం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. తొలి ఓవర్ రెండో బంతికే జోస్ బట్లర్ అవుట్ అయ్యాడు. లిటిల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ టక్కర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టక్కర్ సంధించిన హాఫ్ వ్యాలీ బంతిని కవర్ డ్రైవ్ ఆడబోయాడు. అది కాస్తా బ్యాట్ అంచులను తాకుతూ కీపర్ చేతుల్లో వాలింది.

ఆ తరువాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. జట్టు 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు అలెక్స్ హేల్స్ అవుట్ అయ్యాడు. లిటిల్ బౌలింగ్‌లోనే అడైర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నడుం ఎత్తులో వేసిన బంతిని షార్ట్ ఫైన్ లెగ్ దిశగా షాట్ ఆడాడు హేల్స్. గాల్లోకి ఎగిరిన ఆ బంతిని అడైర్ సులభంగానే అందుకున్నాడు. వన్ డౌన్ బ్యాటర్ బెన్ స్టోక్స్ సైతం ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. హ్యాండ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మెరుపువేసిన లెంగ్తీ బంతిని డిఫెన్స్ ఆడబోగా- బ్యాట్ అండ్ ప్యాడ్‌ను దాటుకుని స్టంప్స్‌ను గాల్లోకి లేపిందా బంతి. ప్రస్తుతం డేవిడ్ మలన్-21, హ్యారీ బ్రూక్-8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

Story first published: Wednesday, October 26, 2022, 12:52 [IST]
Other articles published on Oct 26, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+