Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs IND: శ్రేయస్, పడిక్కల్, షమీలకు అందుకే అవకాశం దక్కలేదు: అజిత్ అగార్కర్

ENG vs IND: ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టును ప్రకటించారు. స్టార్ ఆటగాళ్లు లేకపోవడంతో యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. కానీ కొంత మంది స్టార్ ఆటగాళ్లను కూడా ఇప్పటికీ జట్టులో చేర్చలేదు. శ్రేయస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, మహ్మద్ షమీలకు జట్టులో అవకాశం ఇవ్వలేదు. ఈ ఆటగాళ్లు జట్టులో లేకపోవడానికి గల కారణాన్ని భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలో వివరించారు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయగా.. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ను ఎంపిక చేశారు.

మహ్మద్ షమీకి ఎందుకు అవకాశం రాలేదు?
అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ చాలా కాలంగా టెస్ట్ జట్టులో లేడు. 2023లో జరిదిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో మహ్మద్ షమీ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్ పర్యటనలో మహ్మద్ షమీకి అవకాశం రాలేదనే ప్రశ్నకు అజిత్ అగార్కర్ స్పందిస్తూ.. గత వారం మహ్మద్ షమీకి కొంత ఇబ్బంది ఎదురైందని.. ఈ క్రమంలో షమీ కొన్ని ఎంఆర్ఐలు చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. మహ్మద్ షమీ 5 టెస్టులు ఆడలేడన్నారు. షమీకి పనిభారం ఉండాల్సినంత ఎక్కువగా ఉందని తాను అనుకోనని.. బయటకు వస్తాడని వెద్యులు చెప్పారన్నారు. షమీ ఏదైనా పాత్ర పోషిస్తాడని తాము ఆశించామన్నారు. కానీ షమీ ఫిట్‌గా లేకుంటే వేచి ఉండటానికి బదులు ఫిట్‌గా ఉన్న, అందుబాటులో ఉన్న ఆటగాళ్లను ఎంచుకుంటామన్నారు.

ENG vs IND Why Shreyas Iyer Devdutt Padikkal and Mohammad Shami Missed Selection Ajit Agarkar Explains

శ్రేయస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ కూడా జట్టులో లేరు..
దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్‌కు కూడా జట్టులో అవకాశం దక్కలేదు. దీని గురించి అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అవును శ్రేయస్ అయ్యర్ దేశీయ క్రికెట్‌లో బాగా రాణించాడు. కానీ ప్రస్తుతం శ్రేయస్‌కు జట్టులో చోటు లేదు." అని అన్నారు. అదే సమయంలో ఐపీఎల్‌లో గాయపడిన దేవదత్ పడిక్కల్‌కు కూడా ఈ పర్యటనలో అవకాశం రాలేదు. దేవదత్ పడిక్కల్‌కు ఆస్ట్రేలియా పర్యటనలో ఆడే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో పడిక్కల్‌కు అవకాశం వస్తుందని భావించారు. కానీ ఫిట్‌నెస్ సరిగా లేకపోవడం వల్ల అతడిని తొలగించారు.

ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్( వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్‌ దీప్, కుల్‌దీప్ యాదవ్

Story first published: Saturday, May 24, 2025, 19:05 [IST]
Other articles published on May 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+