Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమ్ బస్సులో కోహ్లీ పక్కనే అనుష్క శర్మ: వీడియో వైరల్

ENG vs IND: Virat Kohli and Anushka Sharma captured together in Cardiff

హైదరాబాద్: బాలీవుడ్ నటి అనుష్క శర్మ టీమిండియాతో జత కలిసింది. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దీంతో మూడు టీ20ల సిరిస్‌లో కోహ్లీసేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 కార్డిఫ్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో మాంచెస్టర్ నుంచి కార్డిఫ్‌కు బయల్దేరిన టీమ్ బస్సులో అనుష్క శర్మ భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పక్కనే కూర్చొంది.

టీమ్ బస్సు కార్డిఫ్‌కు చేరుకున్న తర్వాత ఇద్దరూ బస్సు దిగి జట్టు బస చేసిన హోటల్‌ లోపలకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనుష్క శర్మ రాకతో కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరిగే రెండో టీ20 మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.

కాగా, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 11వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన పలు మ్యాచ్‌లకు అనుష్క శర్మ హాజరైన సంగతి తెలిసిందే. రెండో టీ20లో విజయం సాధించిన టీ20 సిరిస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంటే, ఇంగ్లాండ్ మాత్రం సిరిస్‌ను సమం చేయాలని చూస్తోంది.

మరోవైపు ఈ పర్యటనలో టీమిండియా చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. మరోవైపు కోహ్లీ కూడా ఇంగ్లాండ్ పర్యటనలో కుల్దీప్ యాదవ్ మా ప్రధాన ఆయుధమని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

Story first published: Thursday, July 5, 2018, 15:59 [IST]
Other articles published on Jul 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+