For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs IND 5th Test: ఓవల్‌లో 1000 పరుగులు, కుక్ ఖాతాలో మరో రికార్డు

By Nageshwara Rao
ENG vs IND 5th Test, Day 1 LIVE: Alastair Cook goes past 1000 runs at the Oval

హైదరాబాద్: భారత జట్టుతో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్ అరుదైన ఘనత సాధించాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు కెన్నింగ్‌టన్‌ ఓవల్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్ అలెస్టర్ కుక్ కెన్నింగ్‌టన్‌ ఓవల్‌లో కుక్‌ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ స్టేడియంలో అలెస్టర్ కుక్ వెయ్యికి మించి పరుగులు చేసిన రెండో మైదానం ఇది. అంతకముందు లార్డ్స్‌లో కుక్ 1,937 పరుగులు చేశాడు.

కుక్ తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతుండటంతో కాస్త భావోద్వేగంతో ఆడుతున్నాడు. భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. ప్రస్తుతం 28 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌ (37), మొయిన్ అలీ(2) పరుగులతో ఉన్నారు.

1
42378

కాగా, ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ప్రత్యర్ధి జట్టుపై వరుసగా ఐదు టెస్టుల్లో టాస్ నెగ్గిన మూడో ఇంగ్లాండ్ కెప్టెన్‌గా నిలిచాడు. అంతకముందు ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ కెప్టెన్లు ఎఫ్ఎస్ జాక్సన్(1905లో), కొలిన్ కౌడ్రీ (1960లో) ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన భారత జట్టుపై వరుసగా ఐదు టెస్టుల్లో టాస్ నెగ్గారు.

ఇక, ఇతర కెప్టెన్ల విషయానికి వస్తే 1948/49 భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్‌ జట్టు కెప్టెన్ జాన్ గొడ్దార్డ్ కూడా ఐదు సార్లు టాస్ నెగ్గాడు.

Story first published: Friday, September 7, 2018, 17:42 [IST]
Other articles published on Sep 7, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+