For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరంగేట్ర టెస్టు కోసం టీమిండియాతో పృథ్వీ షా తొలి ప్రాక్టీస్‌ వీడియో వైరల్

By Nageshwara Rao
India vs England 4th Test: Prithvi Shaw Joins With Indian Team For Practice
ENG vs IND 2018: Prithvi Shaw Starts Training with Team India after Debut Test Call

హైదరాబాద్: టెస్టుల్లో అరంగేట్రం చేసేందుకు భారత యువ క్రికెటర్‌ పృథ్వీ షా ఉత్సాహాంగా ఉన్నాడు. ఇంగ్లీషు గడ్డపై టీమిండియాతో కలిసి తొలిసారి నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్టుల కోసం బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో పృథ్వీ షా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ చేరుకున్న పృథ్వీ షా సోమవారం జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. టీమిండియాతో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనడం పృథ్వీ షాకు ఇదే మొదటిసారి. పృథ్వీ షాతో పాటు ఆంధ్ర ఆటగాడు హనమ విహారీ కూడా ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్టులకు ఎంపికైన సంగతి తెలిసిందే.

1
42377

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఆగస్టు 30 నుంచి సౌతాంప్టన్ వేదికగా ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్న ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. కోహ్లీ, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్ యాదవ్‌, పృథ్వీ షా, రహానె, కేఎల్‌ రాహుల్‌తో పాటు పలువురు ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.

Story first published: Tuesday, August 28, 2018, 11:09 [IST]
Other articles published on Aug 28, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+