ENG vs BAN: జేసన్ రాయ్ హాఫ్ సెంచరీ.. బంగ్లాపై ఇంగ్లండ్ ఘన విజయం!!

అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్ మరో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే వెస్టిండీస్‌పై సునాయాస విజయాన్ని అందుకున్న మోర్గాన్ సేన బంగ్లాదేశ్‌పై కూడా అద్భుత విజయాన్ని సాధించింది. బంగ్లా నిర్ధేశించిన 125 పరుగుల లక్ష్యంను ఇంగ్లిష్ జట్టు.. 14.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (61; 38 బంతుల్లో 5x4, 3x6) హాఫ్ సెంచరీ చేశాడు. జొస్ బట్లర్ (18), డేవిడ్ మలన్ (28) రాణించారు. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్, నాసుమ్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో గ్రూప్-1లో ఉన్న ఇంగ్లండ్ జట్టు 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకుచెరో రెండు పాయింట్లు ఉన్నాయి.
వికెట్ ఎలా తీయాలో తెలియక:
125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు జేసన్ రాయ్, జొస్ బట్లర్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. ఎక్కువగా బౌండరీల జోలికి పోకుండా.. స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే 39 పరుగుల వద్ద బట్లర్ (18)ను ఇస్లాం ఔట్ చేశాడు. ఆపై డేవిడ్ మలన్ అండతో రాయ్ ఇన్నింగ్స్‌ను ముందుకునడిపాడు. రాయ్ ధాటికి బంగ్లాదేశ్ విలవిల్లాడింది. అతని వికెట్ ఎలా తీయాలో తెలియక బంగ్లా బౌలర్లు తలలు పట్టుకున్నారు.
రాయ్ హాఫ్:
బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన రాయ్ హాఫ్ సెంచరీ బాదాడు. ఐఐటీ ఎట్టకేలకు షారిఫుల్ ఇస్లామ్ అతన్ని అవుట్ చేసినా అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది. విజయానికి జట్టు అడుగు దూరంలో ఉండగా రాయ్ పెవిలియన్ చేరినా మిగతా బ్యాటర్లు లాంఛనాన్ని పూర్తి చేశారు. డేవిడ్ మలన్ (28 నాటౌట్), జానీ బెయిర్‌స్టో (8 నాటౌట్) రాణించారు. దీంతో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో మరో 35 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్, నాసుమ్ అహ్మద్ చెరో వికెట్ కూల్చారు.
బంగ్లాకు ఆదిలోనే షాక్:
అంతకుముందు బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్లు మహ్మద్ నయీం (5), లిట్టన్ దాస్ (9)ను మొయీన్ అలీ పెవిలియన్ చేర్చాడు. ఇద్దరు క్యాచ్ ఔట్ అయ్యారు. ఆరో ఓవర్లో షకీబుల్ హసన్ (4)ను క్రిస్ వోక్స్ బోల్తాకొట్టించాడు. రషీద్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో షకీబ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపు ముష్ఫికర్ రహీమ్ (39), మహ్మదుల్లా (19) క్రీజులో నిలబడ్డారు. దాంతో బంగ్లా స్కోర్ బోర్డు కాస్త ముందుకు కదిలింది.
రహీమ్ అవుట్ అయిన తర్వాత:
అయితే ముష్ఫికర్ రహీమ్ అవుట్ అయిన తర్వాత బంగ్లాదేశ్ పరిస్థితి పూర్తిగా దిగజారింది. మహ్మదుల్లాతో సమన్వయలోపంతో ఆతిఫ్ హుస్సేన్ (5) రనౌట్ అయ్యాడు. నురుల్ హసన్ (16), మెహెదీ హసన్ (11) కూడా నిరాశపరిచారు. ఇక చివర్లో నాసుమ్ అహ్మద్ (9 బంతుల్లో 19) రెండు సిక్సర్లు కొట్టాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఆఖరి రెండు బంతులకు బంగ్లా జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. అహ్మద్, హసన్ ఆదుకోకుంటే బంగ్లా ఆ మాత్రం స్కోర్ కూడా చేసేదికాదు. ఇంగ్లండ్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3 వికెట్లు పడగొట్టాడు. మొయీన్ అలీ 2, లియామ్ లివింగ్‌స్టన్ 2 వికెట్లు కూల్చగా.. క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications