
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తలకు గాయం గాయమైంది. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేకు దూరమయ్యాడు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో స్మిత్ తలకు దెబ్బ తగిలింది. అయితే ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు. ముందు జాగ్రత్త చర్యగా ఆసీస్ మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతిని ఇచ్చింది.
స్టీవ్ స్మిత్ తలకు గాయం అవ్వడం ఇది రెండోసారి. గతేడాది ఆగస్టులో యాషెస్ సిరీస్‌లోనూ స్మిత్ గాయపడ్డాడు. రెండో టెస్టులో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి స్మిత్ తలకు బలంగా తాకడంతో.. అతడు మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అతనికి కాంకషన్ అవ్వడంతో మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో కాంకషన్ ప్లేయర్‌గా మార్నస్ లబుషేన్ ఆడాడు. దీంతో తొలి కాంకషన్ ప్లేయర్‌గా అతడు రికార్డుల్లోకి వచ్చాడు.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే సమరం ఆరంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ జేసన్ రాయ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక గాయపడిన స్టీవ్ స్మిత్ స్థానంలో బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ జట్టులోకి వచ్చాడు. ఇక మార్కస్ స్టోయినీస్ మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (6) త్వరగానే ఔట్ అయ్యాడు. ఇక మొదటి పవర్ ప్లే ముగిసేసరికి కెప్టెన్ ఆరోన్ ఫించ్ (16) కూడా పెవిలియన్ చేరాడు. అయితే స్టోయినీస్ (33), లబుషేన్ (6) బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసీస్ 13 ఓవర్లలో 68 పరుగులు చేసింది. టీ20 సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్న ఇంగ్లీష్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలో దిగింది. ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో భాగంగా మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది.