Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs ENG: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. లబుషేన్ ఆల్‌టైమ్ రికార్డు!(Video)

ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను సమం చేసిన ఆస్ట్రేలియా అయిదు వన్డేల సిరీస్‌ను ఘనంగా బోణీ కొట్టింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఏడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. విజయంలో ట్రావిస్ హెడ్ (154 నాటౌట్; 129 బంతుల్లో, 20 ఫోర్లు, 5 సిక్సర్లు), మార్నస్ లబుషేన్ (77 నాటౌట్; 61 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకపాత్ర పోషించారు.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (95; 91 బంతుల్లో, 11 ఫోర్లు) తృటిలో శతకం కోల్పోయాడు. విల్ జాక్స్ (62; 56 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో జంపా, లబుషేన్ చెరో మూడు వికెట్లు, హెడ్ రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 44 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. బెథెల్, పాట్స్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ తీశారు.

ENG vs AUS Marnus Labuschagne Creates History with 50 Runs 3 Wickets and 4 Catches in a Single ODI

అయితే ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. వన్డే చరిత్రలో తొలిసారి అరుదైన రికార్డు నమోదైంది. ఓ వన్డే మ్యాచ్‌లో 50+ పరుగులు, మూడు వికెట్లు, నాలుగు క్యాచ్‌లు అందుకున్న తొలి క్రికెటర్‌గా లబుషేన్ చరిత్ర సృష్టించాడు. అర్ధశతకంతో పాటు మూడు వికెట్లు తీసిన లబుషేన్ ఈ మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక ఒక వన్డేలో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక బౌండరీలు సాధించిన మూడో ప్లేయర్‌గా ట్రావిస్ హెడ్ రికార్డు నెలకొల్పాడు.

ఈ మ్యాచ్‌లో హెడ్ 20 ఫోర్లు బాదాడు. డేవిడ్ వార్నర్ (24), గ్లెన్ మాక్స్‌వెల్ (21) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. హెడ్ మరో ఘనత సాధించాడు. వన్డేల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక స్కోరు సాధించిన రెండో ఆస్ట్రేలియన్‌గా హెడ్ (154*) రికార్డులకెక్కాడు. షేన్ వాట్సన్ (161*) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక వన్డేల్లో ఆస్ట్రేలియాకు వరుసగా ఇది 13వ విజయం. అలాగే పరుగుల పరంగా ఇది అయిదో అతి పెద్ద విజయవంతమైన ఛేదన.

Story first published: Friday, September 20, 2024, 8:52 [IST]
Other articles published on Sep 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+