ENG vs AUS: స్టార్క్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ ఊచకోత.. ఆల్‌టైమ్ రికార్డు!(Video)
లార్డ్స్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 186 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 39 ఓవర్లకే కుదించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఆసీస్ ఆధిక్యాన్ని 2-2తో సమం చేసింది. అయిదు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మక ఆఖరి వన్డే ఆదివారం జరగనుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 39 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (87; 58 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్సర్) తన ఫామ్ కొనసాగిస్తూ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ డకెట్(63; 62 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకం సాధించాడు. లివింగ్ స్టోన్ (62 నాటౌట్; 27 బంతుల్లో, 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.

ఆసీస్ బౌలర్లలో జంపా రెండు, మాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, హేజిల్‌వుడ్ తలో వికెట్ తీశారు. అనంతరం 313 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. ట్రావిస్ హెడ్ (34; 23 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. మాథ్యూ పాట్స్ నాలుగు వికెట్లు, బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు, ఆదిల్ రషీద్ ఒక వికెట్ తీశారు.
ఆసీస్‌కు శుభారంభమే దక్కింది. హెడ్, మిచెల్ మార్ష్ (28; 34 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత 58 పరుగుల వ్యవధిలోనే ఆసీస్ పది వికెట్లు కోల్పోయింది. నలుగురు ఆసీస్ బ్యాటర్లే రెండంకెల స్కోరు అందుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ విధ్వంసమే హైలైట్. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో అతను ఊచకోతకు దిగాడు.
స్టార్క్ వేసిన ఈ ఓవర్‌లో లివింగ్‌స్టోన్ నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీ సాధించాడు. ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. అయితే ఈ క్రమంలో మిచెల్ స్టార్క్ పేరిట ఆల్‌టైమ్ చెత్త రికార్డు నమోదైంది. వన్డేల్లో ఓ ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆస్ట్రేలియన్ బౌలర్‌గా స్టార్క్ కోరుకోని రికార్డు నమోదు చేసుకున్నాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోనూ స్టార్క్‌కు ఇలాంటి పీడకలే ఎదురైన సంగతి తెలిసిందే. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగి స్టార్క్ ఓవర్‌లో 29 పరుగులు సాధించాడు. టీ20ల్లో ఓ ఓవర్‌లో ఆస్ట్రేలియన్ ఇచ్చిన రెండో అత్యధిక పరుగులు ఇవే.
6️⃣▪️6️⃣6️⃣6️⃣4️⃣
— England Cricket (@englandcricket) September 27, 2024
Incredible final over hitting from Liam Livingstone 💪💥
🏴 #ENGvAUS 🇦🇺 | @liaml4893 pic.twitter.com/qfEDxOM88N
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications