ENG vs AUS: హెడ్ ఊచకోత.. ఆస్ట్రేలియా ఘన విజయం (Video)
ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను సమం చేసిన ఆస్ట్రేలియా అయిదు వన్డేల సిరీస్‌ను ఘనంగా బోణీ కొట్టింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఏడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ (154 నాటౌట్; 129 బంతుల్లో, 20 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ విధ్వంసకర శతకం బాదాడు. మార్నస్ లబుషేన్ (77 నాటౌట్; 61 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో సత్తాచాటాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (95; 91 బంతుల్లో, 11 ఫోర్లు) తృటిలో శతకం కోల్పోయాడు. విల్ జాక్స్ (62; 56 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో జంపా, లబుషేన్ చెరో మూడు వికెట్లు, హెడ్ రెండు వికెట్లు తీశారు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించింది.

48 పరుగుల వద్ద సాల్ట్ (17; 24 బంతుల్లో, 2 ఫోర్లు) ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన జాక్స్‌తో కలిసి డకెట్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జాక్స్ ఔటైన అనంతరం ఇంగ్లండ్ బ్యాటర్లు క్రమంగా వికెట్లు కోల్పోయారు. కుదురుకున్నట్లు అనిపించిన కాసేపటికే వికెట్ చేజార్చుకున్నారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (39; 31 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బెథెల్ (35; 34 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు.
అనంతరం ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 44 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. మిచెల్ మార్ష్ (10; 14 బంతుల్లో, 2 ఫోర్లు) ఆదిలోనే ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన స్టీవ్ స్మిత్ (32; 28 బంతుల్లో, 3 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (32; 32 బంతుల్లో, 5 ఫోర్లు) హెడ్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయిదో స్థానంలో లబుషేన్ క్రీజులోకి వచ్చిన తర్వాత ఇంగ్లండ్‌కు మరో అవకాశం దక్కలేదు. హెడ్-లబుషేన్ అభేద్యంగా 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొప్పి జట్టును గెలిపించారు. రెండో వన్డే శనివారం జరగనుంది.
150 for Travis Head 👏
— Sky Sports Cricket (@SkyCricket) September 19, 2024
A magnificent innings from Australia's opener 🇦🇺 pic.twitter.com/y1UdkNkwN2
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications